బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ ను పరామర్శించిన సురభి నవీన్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 21 : బీజేపీ లీగల్ సెల్ కోరుట్ల నియోజకవర్గ కన్వీనర్ సూతారి శ్రీనివాస్ మాతృమూర్తి సుతారి రాజ గంగు ఇటీవల మరణించగా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ శుక్రవారం వారి నివాసానికి వెళ్లి సుతారి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సురభి నవీన్ వెంట స్ధానిక బీజేపీ, బిజేవైయం నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.