సి ఈ ఐ ఆర్ పోర్టల్ ఆధారంగా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ అప్పగింత
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి జనవరి 10 :
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన రాదారం బాలరాజు తన మొబైల్ సెల్ ఫోన్ గత సంవత్సరం క్రితం పోగొట్టుకోగా మోర్తాడ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేసి పోర్టల్ ఆదారముగా సెల్ ఫోన్ ఆచూకీ తెలుసుకొని సెల్ ఫోన్ ను రాధారం బాలరాజు కు శుక్రవారం రోజు మోర్తాడ్ పోలీస్ స్టేషన్లో భీంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. నవీన్ అప్పగించారని మోర్తాడ్ ఎస్‌ఐ బి.విక్రమ్ తెలిపారు .