---Advertisement---

ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సర్వే ప్రారంభం.

---Advertisement---

ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సర్వే ప్రారంభం.

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 13):

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమైండ్ల పథకానికి సంబంధించి గ్రామాల్లో మొబైల్ ఫోన్ ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండల పరిధిలోని వెల్టూర్ గ్రామంలోని మూడో రోజు శుక్రవారం ఇంటింటికి తిరుగుతూ గ్రామ పంచాయితీ కార్యదర్శి ఉమా శంకర్ శుక్రవారం మొబైల్ ఫోన్ యాప్ ద్వారా సర్వే నిర్వహించారు.నిరుపేదలకు పక్కగా ఇందిరమ్మ ఇండ్ల కట్టించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకానికి సంబంధించి ఇంటి యజమానితో కావాల్సిన పత్రాలు అడుగుతూ యాప్ లో వివరాలు నమోదు చేస్తున్నారు.సర్వే కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది సైదులు గౌడ్, గోస్కే బాలరాజు, గుద్దటి బాలరాజు, ఎం.డీ అబ్బు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment