సూర్యాపేట పూర్వ విద్యార్థి మిత్రమండలిని బలోపేతం చేస్తాం

సూర్యాపేట పూర్వ విద్యార్థి మిత్రమండలిని బలోపేతం చేస్తాం

 

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్

.సమాజ సేవలో పూర్వ విద్యార్థి మిత్రమండలని బలోపేతం చేస్తామని ఆ సంఘం పట్టణ అధ్యక్షులు నల్లగుంట్ల అయోధ్య తెలిపారు.ఆదివారము సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపం లోసూర్యాపేట పూర్వ విద్యార్ధి మిత్ర మండలి”ప్రధమ వార్షికోత్సవం”ను ఘనంగా నిర్వహించారు. తొలుత అమర వీరులకు ఘనంగా నివాళులర్పించారు.అమరులపై కళాత్మకంగా పాటలు పాడారు.ఈ సంధర్భంగా ప్రధానకార్యదర్శి బయ్యా మల్లికార్జున్ మాట్లాడుతూ సూర్యాపేట పూర్వ విద్యార్ధి మిత్ర మండలి డిసెంబర్ 30, 2023 న ఏర్పడి నేటికి ఏడాది పూర్తి అయినందున, వార్షికోత్సవ వేడుక జరుపు కుంటున్నామని తెలిపారు.గత సంవత్సర కాలంలో మిత్ర మండలి చేపట్టిన సామాజిక ప్రజాహిత సేవా కార్యక్రమాలను సభకు సమర్పించారు.2024 ఆంగ్ల సంవత్సరానికి వీడ్కోలు పలుకుతునూతన సంవత్సరం 2025 స్వాగతం పలుకుతూ రానున్న కాలంలో మిత్ర మండలిని మరింత బలోపేతం చేసి ప్రజల ముందుకు వచ్చి ప్రజాస్వామ్య బద్దంగా సమస్యలపై స్పందించి పోరాటం చేస్తామని చెప్పారు. అనంతరం గురుకుల పాఠశాల విద్యార్థుల నరక యాతన జీవితంపై కలత చెందుచు, బాధ్యులపై తగిన కట్టు దిట్టమైన, కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తు, తీర్మానం ప్రవేశపెట్టారు. విద్యార్థులకు సెల్ఫోన్ వాడకం వలన జరుగు లాభనష్టాల పై వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.నూతన కమిటీ ఎన్నికల్లో గౌరవాధ్యక్షుడుగా,వై.నర్సయ్య, అధ్యక్షుడుగా, నల్లగుంట్ల అయోధ్య, ఉపాధ్యక్షునిగా నల్లపాటి అప్పారావు, ప్రధాన కార్యదర్శిగా,బయ్యా మల్లికార్జున్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా, షేక్ సైదులు, జాయింట్ సెక్రటరీగా, మాధంశెట్టి నాగేశ్వరరావు, ఎడ్షినల్ సెక్రటరీగా, సట్టు వెంకన్న,కల్చరల్ సెక్రటరీగా గుండ్ల కొమురయ్య, పబ్లిసిటీ సెక్రటరీగా తన్నీరు యాదగిరి, కోశాధికారిగా, గీసా రాంచందర్ కార్యదర్శి వర్గ సభ్యులుగా,అంబాలమ్మ, నూకల లక్ష్మీ,పిండిగ అరోన్,వీర్లపాటి వెంకన్న,వీర బోయిన సుందరయ్య, షేక్ ఇక్బాల్ పాషా, చంద్రమౌళి,బట్టిపల్లి వెంకన్నలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీతో గౌరవాధ్యక్షులు ప్రమాణస్వీకారం చేయించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment