సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ విలేకరుల సమావేశం .

సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ విలేకరుల సమావేశం .

నిర్వహించి జిల్లా పోలీసు వార్షిక నివేదికను వెల్లడించారు.

తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్

సూర్యాపేట జిల్లా పోలీసు స్నేహపూర్వక పోలీస్ విధానం అవలంబిస్తూ బాధ్యతాయుతంగా పారదర్శకంగా పనిచేస్తూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి శాంతి భద్రతల పరిరక్షణలో బాగా కృషి చేస్తున్నాం అని, ఈ సంవత్సరం బాగా పని చేశామని, పోలీసు నిధుల నిర్వహణలో నేరాల నివారణలో ప్రజలు పౌరుల భాగస్వామ్యమై పోలీసులకు సహకరించారు అని ఎస్పీ తెలిపినారు.
సూర్యాపేట జిల్లాలో 2023 సంవత్సరంతో పోలిస్తే 2024 సంవత్సరం నందు నేరాలు సమానంగా నమోదైనప్పటికీ కొంతమేర తగ్గుదల ఉన్నదని తెలిపారు. ఈ సంవత్సరం డయల్ 100 కు ఫోన్ కాల్ ద్వారా 34950 ఫిర్యాదులు రాగా సగటున 6 నిమిషాల్లో బాధితులకు పోలీసు సేవలు అందించాం అన్నారు. 2023 నందు 7244 కేసులు నమోదు కాగా 2024 సం.లో 7178 కేసు నమోదైనాయి అన్నారు. వీటిలో భౌతిక దాడులు 796 కేసులు, రోడ్డు ప్రమాదాలు 609 కేసులు, మహిళా సంబంధిత నేరాలు 557 కేసులు, మద్యం అక్రమ రవాణా అక్రమ అమ్మకాలు 434 కేసులు, దొంగతనాలు 536 కేసులు, వంచన మోసాలు 325 కేసులు, సైబర్ నేరాలు 205 కేసులు గా నమోదైనాయి అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలను జూలై నెల నుండి జిల్లాలో అమలు చేస్తున్నామని ఇప్పటివరకు కొత్త చట్టాల క్రింద 3513 కేసులు నమోదు చేశామని మొదటి కేసును గరిడేపల్లి పోలీస్ స్టేషన్ నందు నమోదు చేయడం జరిగిందని అన్నారు. సైబర్ మోసాలు పెరుగుతున్నాయని ఈ సంవత్సరం 1212 ఫిర్యాదు లాగా 2005 కేసులు నమోదు చేశామని సైబర్ మోసాల ద్వారా మోసానికి గురైన 7.83 కోట్ల రూపాయల నుండి సుమారు 40 లక్షల వరకు బాధితులకు రిఫండ్ చేశామని, 1.16 కోట్ల రూపాయలను బ్యాంక్ లలో హోల్డ్ చేయించాం అన్నారు.
ఎన్ఫోర్స్మెంట్ వర్క్ బాగా పెంచడం జరిగింది 38 గంజాయి కేసుల్లో 318 కేజీల గంజాయిని సీజ్ చేసి 135 మందిని జైలుకు పంపించాము గత సం.తో పోలిస్తే గంజాయి కేసుల్లో ఎక్కువ మందిని అరెస్టు చేశాం అన్నారు. ప్రజా పంపిణీకి చెందిన బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఈ సంవత్సరం 178 కేసులు నమోదు చేసి 3200 క్వింటాల బియ్యం సీజ్ చేశాం. బియ్యం అక్రమ రావానాకు సంభందించి 2023 సంవత్సరం తో పోలిస్తే 2024 సం.లో 160% ఎక్కువగా PDS రైస్ కేసులు నమోదు చేసి 193% ఎక్కువగా బియ్యం సీజ్ చేశాం అన్నారు. 289 మందిని రిమాండ్ కు తరలించామని, ఇద్దరిపై PD యాక్ట్ నమోదు చేశాం అన్నారు.
ఇసుక అక్రమ రవాణాలో 522 కేసులు బుక్ చేసి 650 మందిని అరెస్ట్ చేశామన్నారు. గేమింగ్ యాక్ట్ సంబంధించి 54 కేసులు నమోదు చేసి 313 మందిని అరెస్ట్ చేశామన్నారు. ప్రతిరోజు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తూ 236289 e-chalan కేసులు నమోదు చేసి 7.53 కోట్ల రూపాయలు జరిమానా విధించడం జరిగినది. అలాగే వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకపోయినా డామేజ్ అయిన దానికి సంబంధించి 11321 కేసులు నమోదు చేసి 26 లక్షల 64 వేల రూపాయలు జరిమానా వేయించడం జరిగింది అన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 12,940 మందిపై కేసులను నమోదు చేసి 66 లక్షల 97 వేల రూపాయలు జరిమానా విధించడం జరిగింది.
జిల్లాలో గత సంవత్సరం 122 తీవ్రమైన నేరాలు నమోదు కాగా ఈ సంవత్సరం 36% పెరిగి 167 కేసులు నమోదయ్యాయి ఈ 166 కేసుల్లో కేసుల్లో 151 యొక్క కేసులు 90 శాతం చేదించి నేరాలకు పాల్పడిన వారిని రిమాండ్ కు తరలించామని తెలిపారు. దొంగతనాలకు సంబంధించి ఈ సంవత్సరం 536 కేసులు నమోదయాయని వీటిలో 63% కేసులు 338 కేసు సేదించి 45% 2 కోట్ల 20 లక్షలు సొమ్ము రికవరీ చేశామన్నారు రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. వివిధ రూపాల్లో పోగొట్టుకున్నటువంటి మొబైల్స్ సంబంధించి 1780 ఫిర్యాదులు రాగా అందులో 1140 (65%) మొబైల్స్ రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగింది. నేరాల్లో శిక్షల అమలకు సంబంధించి ఈ సంవత్సరం 1082 కేసులు వాదనకు రాగా 32 కేసుల్లో 24 మందికి జైలు శిక్షలు అమలు అయ్యాయి వీటిలో ఆరుగురికి జీవిత ఖైదు ఇద్దరికీ 15 సంవత్సరాల పైబడి శిక్ష, ఇద్దరికీ 10 సంవత్సరాల పైబడి శిక్ష, ఇద్దరికీ ఐదు సంవత్సరాల పైబడి శిక్ష, ఇద్దరికీ మూడు సంవత్సరాల పైబడి శిక్ష, ఇద్దరికీ ఒక సంవత్సరం పైబడి శిక్ష మరో ఎనిమిది మందికి సంవత్సరంలోపు శిక్షలు అమలు అయ్యాయి. కోర్టు మానిటరింగ్ లో సమన్వయంగా బాగా పనిచేస్తున్నామని తెలిపారు. లోక్ అదాలత్నందు 38298 పెట్టీ కేసులను పరిష్కరించామని తెలిపారు.
రోడ్డు ప్రమాదాలకు సంబంధించి గత సంవత్సరం 573 కేసుల్లో 257 మంది మరణించగా ఈ సంవత్సరం 609 కేసుల్లో 262 మంది మృత్యువాత పడ్డారు ఈ మృత్యువాత పడ్డ వారిలో 320 కేసుల్లో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై 151 యొక్క మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని వీటి నివారణకు ప్రణాళిక పరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వివరించారు.
మహిళా భద్రతకు సంబంధించి జిల్లాలో స్థానిక పోలీసులతో కలిసి షీ టీమ్స్, భరోసా సెంటర్స్ పనిచేస్తున్నాయని అన్నారు. ఈ సంవత్సరం షీ టీమ్స్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 165 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని 2023 నందు షీ టీమ్స్ కి 141 ఫిర్యాదులు రాగా ఈ సంవత్సరం ఫిర్యాదులు తగ్గి 75 ఫిర్యాదులు వచ్చాయని 135 ఫ్యామిలీ కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. షీ టీం సిబ్బంది ప్రజల్లో తిరుగుతూ 98 పెట్టి కేసులను నమోదు చేశారని తెలిపారు. భరోసా సెంటర్ ద్వారా 132 మందికి కౌన్సిలింగ్ ఇచ్చి 81 కేసుల్లో వైద్య సదుపాయము అందించారు అన్నారు.
ఆపరేషన్ ముస్కాన్ స్మైల్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఫ్యాక్టరీలు ఇటుక బట్టీలు లేబర్ అర్థాలు హోటల్స్ లాడ్జిలనుంది షాప్స్ నందు పనిచేస్తున్న 236 మంది బాలురులను 43 మంది బాలికలను సంరక్షించడం జరిగింది. మహిళా కేసులకు సంబంధించి గత సంవత్సరం 5503 కేసులు నమోదు కాక ఈ సంవత్సరం 557 కేసులు నమోదయ్యాయి హరాస్మెంట్ కేసులు అత్యాచారం కేసులు పెరిగినాయి. పోలీసు ప్రత్యేక చర్యల వల్ల ఈ సంవత్సరం ఈ టీజింగ్ కేసులు 18 శాతం తగ్గాయి.
సమాజంలో గొడవలకు, నేరాలకు పాల్పడతారని ముందస్తుగా 344 కేసుల్లో 1888 మంది అనుమానితులను బైండోవర్ చేశామని తెలిపారు.
సామాజిక అంశాలపై ప్రజలను చైతన్య పరుస్తూ గత సంవత్సరం పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో 240 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని 2024 సంవత్సరం నందు 360 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment