సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రము యోగ సాధకులకు సన్మానం
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 29
.ఈ నెల 22 న కరీంనగర్ లో జరిగిన యోగ పోటీలలో విజేతలుగా నిలిచిన యోగసాధకులకు ఆదివారం సూర్యాపేట ఉన్నత యోగ శిక్షణ కేంద్రం యోగా గురువు చాడ పాపిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ ఎస్సై కుశలవ అతిథులుగా సంత్ నిరంకార్ సంస్థ అధ్యక్షురాలు కడారి సరళ, డాక్టర్ నిర్మల్ కుమార్ పాల్గొనడం జరిగినది.ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ కుశలవ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో యోగా ప్రతి ఒక్కరికి అవసరమని అన్నారు.మానసిక ఒత్తిడితో ఎంతోమంది బాధపడుచున్నారని వారు యోగా చేయడం వలన ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, సహనం,ఓపిక ఏర్పడుతుందని తెలిపారు. యోగా చేయడం ద్వారా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఉద్యోగస్తులు ,వ్యాపారస్తులు విద్యార్థులు ఎవరికైనా యోగ ఎంతో అవసరం అని అన్నారు. ఆరోగ్యం కొరకు యోగా చేసుకుంటూ యోగా పోటీలలో ,రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలలో పాల్గొంటూ మన సూర్యాపేటకు పేరు ప్రఖ్యాతలు చేస్తున్న సాధకులను అభినందించారు. అందులో ముఖ్యంగా మహిళలు వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వివిధ స్థాయిలలో మేమున్నామంటూ పోటీలలో పాల్గొనీ పథకాలు గెలవడం హర్షినియన్నారు.ఇక ముందు కూడా ఇలాంటివి ఎన్నో పథకాలు సాధించి మన సూర్యాపేటకు పేరు ప్రఖ్యాతలు తేవాలని కోరడం జరిగినది. ప్రస్తుత తరుణంలో కంప్యూటర్ టెక్నాలజీ పెరగడంతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సాధకులు భాస్కర చారి, సుదర్శన్ రెడ్డి, సుధాకర్, మమత, వి లింగయ్య,మల్లారెడ్డి, గోరంట్ల శ్రీనివాస్, బాణాల శ్రీనివాస్,సుజాత, కిరణ్మయి, సామ్రాజ్యం, స్వరూప, కల్పన, ధనలక్ష్మి, జయలక్ష్మి, మంజుల, అనిత, శ్రీదేవి, నాగలక్ష్మి, ఓ లింగయ్య, కృష్ణారెడ్డి, డాక్టర్ సతీష్, సైదులు తదితరులు పాల్గొన్నారు.