చేంజ్ మేకర్స్ కన్క్లేవ్ కార్యక్రమంలో చేంజ్ మేకర్స్ అవార్డు తీసుకున్న సూర్యాపేట మున్సిపాలిటీ

చేంజ్ మేకర్స్ కన్క్లేవ్ కార్యక్రమంలో చేంజ్ మేకర్స్ అవార్డు తీసుకున్న సూర్యాపేట మున్సిపాలిటీ

 

 

తెలంగాణ కెరటం ; సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 19 .

స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛత కార్యక్రమాలు, స్వచ్ఛ సర్వేక్షన్ లో మెరుగైన ప్రదర్శన, ప్లాస్టిక్ వ్యర్ధాలతో టైల్స్ బ్రిక్స్ మ్యాట్లు మరియు ఇతర వస్తువులు తయారు చేయడం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్వచ్ కార్యక్రమాలు మరియు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన మున్సిపాలిటీలకు సి ఎస్ ఈ ( సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ) మరియు ఏం ఓ ఎచ్ యూ ఏ సంయుక్తంగా ఢిల్లీలో డిసెంబర్ 19 న సిల్వర్ హోక్ హాల్ లో ఏర్పాటు చేసిన చేంజ్ మేకర్స్ కార్యక్రమంలో డా. సునీత నరైన్(సీ యస్ ఈ డైరెక్టర్) గారి చేతుల మీదుగా చేంజ్ మేకర్ అవార్డు ను సూర్యాపేట పురపాలక సంఘ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ చిప్పలపల్లి శివప్రసాద్ గారు అందుకోవడం జరిగింది. చేంజ్ మేకర్స్ అవార్డు సూర్యాపేట మున్సిపాలిటీకి రావడం పట్ల కమిషనర్ బి. శ్రీనివాస్ గారు హర్షం వ్యక్తం చేస్తూ పారిశుద్ధ సిబ్బందికి మరియు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్ కి అభినందనలు తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment