నృత్య కళాకారిణి మోక్షాధృతికి స్వర్ణనంది అవార్డు

నృత్య కళాకారిణి మోక్షాధృతికి స్వర్ణనంది అవార్డు

 

(తెలంగాణ కెరటం) ఘట్ కే సర్ ప్రతినిధి / జనవరి నృత్యం పట్ల ఆసక్తి, అభిరుచితో పాటు కళానైపుణ్యానికి మెరుగులు దిద్దుకుని శాస్త్రీయ నృత్యంలో రాణించిన కూచుపుడి నాట్య కళాకారిణి మోక్షాధృతి అభినందనీయురాలని మాజీ న్యాయమూర్తి బుర్గుల మధుసూదన్ తెలిపారు. నగరంలోని శ్రీత్యాగరాయ గానసభలో మహతి ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో స్వర్ణనంది అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ న్యాయమూర్తి మధుసూదన్, రిటైర్డ్ ఐఎస్ అధికారి ఆర్ వి చంద్రవదన్, సంఖ్యా శాస్త్రవేత్త దైవజ్ఞశర్మ, ప్రముఖ కూచిపూడి నాట్య గురువు పి జాన్సీరామ్ లు పాల్గొన్నారు. అభిరుచి అంకిత భావంతో పాటు కఠోర శ్రమ ఉన్నప్పుడే జాతీయ, అంతర్జాతీ స్థాయికి చేరుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా జరిగిన నృత్య ప్రదర్శనలో ఎన్ ఎఫ్ సి నగర్ కు చెందిన మోక్షా ధృతి అత్యంత ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన కుమారి మోక్షాధృతి స్వర్ణనంది ఆవార్డు అందుకున్నారు. శాస్త్రీయ నృత్యంలో రాణించేందుకు అసాధారణమైన నృత్య ప్రదర్శనలు చేయాలని, పట్టుదల, క్రమ శిక్షణ కలిగిన ప్రతి ఒక్కరు అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపు పొందుతారని చెప్పారు. నృత్య ప్రదర్శనలో కుమారి మోక్షాధృతి నృత్య ప్రదర్శనను దైవజ్ఞ శర్మ అభినందించారు. ఈ సందర్భంగా నాట్యగురువు జాన్సీరామ్ ను శాలువాలు, పూలమాలలో సన్మానించారు.ఈ కార్యక్రమంలో పసుమర్తి శేషుబాబు, సజని వల్లభనేని, నిర్వహకులు, నాట్యగురువులు, తల్లిదండ్రుల, నృత్య కళాకారణీలు పాల్గొన్నారు. ఫోటోరైటఫ్

1: శ్రీత్యాగరాయ గానసభలో కూచిపూడి నాట్య ప్రదర్శన యిచ్చి స్వర్ణనంది అవార్డు అందుకుంటున్న మోక్షాధృతి

Join WhatsApp

Join Now

Leave a Comment