ఆత్మీయతకు ప్రతీకలు

గొప్పగా కిన్నెర కుటుంబాల
ఆత్మీయ సమ్మేళనం
నాలుగు తరాలు ఒకేచోట
ఉద్యోగులు, మేధావులకు
ఘన సన్మానం
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి
వేల మంది హాజరు

ఖమ్మం జిల్లా బ్యూరో, జనవరి 17 (తెలంగాణ కెరటం): ఆత్మీయతకు ప్రతీక ‘కిన్నెర కుటుంబం’ 2 వేల మందితో కిన్నెర కుటుం బాల ఆత్మీయ సమ్మేళనం ఖమ్మంలో ఘనంగా జరిగింది. ఖమ్మం నగరంలోని సూర్యదేవర ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి కిన్నెర కుటుంబాలు నాలుగు తరాల వారు సుమారుగా 2000 మందితో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కిన్నెర కుటుంబ ఆత్మీయ సమ్మేళన కమిటీ అధ్యక్షులు కిన్నెర ప్రసాద్, ఉపాధ్యక్షులు కిన్నెర కుటుంబరావు, గౌరవ సలహాదారులు ఏఎస్ఐ కిన్నెర వెంకటేశ్వర్లు, కండక్టర్ కిన్నెర ఆనంద్, వెటర్నరీ డాక్టర్ కిన్నెర వెంకటేశ్వరరావు లతో పాటు కిన్నెర కుటుంబ సభ్యులు కిన్నెర కుటుంబ పేరుతో ఉన్న వారందరినీ ఒక వేదిక మీదికి తీసుకురావడానికి వారి కృషి ఎంతో అభినందనీయం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కిన్నెర కుటుంబాలలో విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, ఆర్థిక పరమైన విధానాలలో ఐకమత్యంతో ముందు కు సాగాలని, అందరూ సహకరించాలని కోరారు. కిన్నెర కుటుంబాలలోని ఉద్యోగులు, డాక్టర్లు, విద్యలో రాణిస్తున్న విద్యార్థులు, ముందుతరాల వృద్ధులను ఘనంగా ఆత్మీయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో కొణిజర్ల కిన్నెర కుటుంబాల వారు కోలాట నృత్యాలతో అలరించారు. అలాగే గాయకులు వారి పాటలతో అందరిని మైమరిపించారు. కిన్నెర కుటుంబ సభ్యులు ఒకేచోట కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఇతరులకు ఆదర్శమని కొనియాడారు. నాలుగు తరాల వారు ఒకే ఇంటి పేరుతో ఉన్న కిన్నెర ఆత్మీయ సమ్మేళనాన్ని ఏకాభిప్రాయంతో మంచి కార్యక్రమని అభినందించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ వెంకటేశ్వరరావు కర్ర సాముతో అలరించారు. కిన్నెర ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన సభ్యులను ప్రతి ఒక్కరూ అభినందించారు. కళాకారులు పమ్మి రవి బృందం, ఓం బొమ్మెర ముత్యం, పాగి వెంకన్న, గోవింద గురవయ్య, పి. వీరబాబు లు వారి పాటలతో ఎంతో అలరింపజేశారు. ముఖ్య అతిథులుగా కిన్నెర కుటుంబానికి చెందిన అల్లుళ్ళు బొమ్మెర రామ్మూర్తి, కొత్తపల్లి గురు ప్రసాద్ లు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కిన్నెర ఆత్మీయ సమ్మేళనం కమిటీ సభ్యులు కుటుంబరావు, నాగేశ్వరరావు, రాము, ఆర్టీసీ ఆనందరావు, రమేష్, శ్రీనివాసరావు, ఏనుకూరు కుటుంబ సభ్యులు కిన్నెర రాములు, రాంబాబు, పాపారావు, మహిళా ప్రతినిధులు కరుణ, విజయ, ఝాన్సీ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment