ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన తహసిల్దార్
తెలంగాణ కెరటం భీంగల్ ప్రతినిధి నవంబర్ 30:
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలంలో
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం భీంగల్ మండలంలోని బడా భీంగల్ ప్రభుత్వ ప్రైమరీ,హై స్కూల్, ను స్థానిక తహసిల్దార్ మహమ్మద్ షబ్బీర్ తనిఖీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని పాఠశాలల ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే భోజనాన్ని వంటగదిని పరిశీలించి పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. పిల్లలు తినే ఆహారాన్ని నాణ్యతతో అందించాలన్నారు.అలాగే పిల్లకు వడ్డించే పప్పులు, కూరగాయలు, బియ్యము, ఇతర సరుకులు ఉండే రూములను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని పాఠశాల సిబ్బందికి తెలిపారు.ఈ తనిఖీలు ఆయన వెంట నాయబ్ తహసిల్దార్ శ్రీనివాస్, ఎలక్షన్ డిటి అశ్విన్, అలాగే పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు…