జిల్లా కలెక్టర్ ను కలిసిన తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 10:
03-12-2024 తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం మెదక్ జిల్లా కొత్త కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఏ విటల్ మరియు సెక్రెటరీ నాగభూషణం మరియు ఇతర కార్యవర్గ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ రాజ్ ను , అదనపు కలెక్టర్ నగేష్ కలవడం జరిగింది.ఈ సందర్భంగా సంఘ సభ్యులకు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ శుభాకాంక్షలు అందించడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు శ్రీ విట్టల్ మాట్లాడుతూ గెజిటెడ్ ఉద్యోగుల యొక్క క్షేత్రస్థాయిలో సమస్యలను ఉన్నతాధికారులకు మరియు జిల్లా కలెక్టర్ వారికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోని ప్రజలకు అందే విధంగా గెజిటెడ్ ఉద్యోగులు అహర్నిశలు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు సెక్రెటరీ ఇతర కార్యనిర్వాహక సభ్యులు పాల్గొనడం జరిగింది.