ముగుస్తున్న మున్సిపాలిటీ పాలక మండలి పదవీకాలం.

ముగుస్తున్న మున్సిపాలిటీ పాలక మండలి పదవీకాలం.

శిలాపలకపై పేర్ల కోసం అమృత్ జల్ 2.0 ప్రారంభోత్సవానికి పాలకమండలి సన్నాహాలు.

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి,

 

:మక్తల్ మున్సిపాలిటీకి తాగునీటి సమస్య నివారణ పేరున తమ హయాములో కార్యాచర్ణం జరిగిందని శిలాఫలక పై పేర్ల కోసం ఆదివారం అమృతై జల్ 2.0 పథకాన్నికి ఎం పి.ఎమ్మెల్లేతొ ప్రస్తుత పాలకమండలి శంకుస్థాపన సన్నహలు చేస్తున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య నిదుల ఖర్చుతో పథకం అమలు చేయాలని నిబంధనలు ఉన్నాయి. గథ తేరాస ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేస్తున్నందున ఈ పథకంపై నిదులు ఎందుకూ ఖర్చు చేయాలి ఈ పథకం పూర్తిచేస్తే సరే అని అమృత్ 2.0 పట్టించుకోలేదు. పాలకమండలి. మున్సిపల్ కమిషనర్ గాని చొరవ చూపకపోవడం పథకం మూలకు పడింది. మిషన్ భగీరథ పథకం మక్తల్ మున్సిపాల్టీలో. అర కొరకు పనులు చేయడంతో పలు కాలనీలో తాగునీరు అందక తాగునీటికీ ప్రజల అవస్థలు పడుతున్నారు.ప్రస్తత మున్సిపాలిటీ పాలక మండలి ప్రజలకు తాగునీటికీ కష్టాలు తీర్చలేదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తారన్న ముందు జాగ్రత్తతొ ఎంతో ప్రతిష్టాత్మ కంగా తాగునీటి పథకం అమృత్ 2.0 ఈనెల 26 తర్వాత మక్తల్ మున్సిపాలిటీ పదవీకాలం పూర్తౌవుతున్నందున మళ్లీ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటి చెస్తున్న వారు తమ హయాంలో శాశ్వత మంచినీటి పరిష్కారం చేశామని శిలా పాలకపై తమ పేర్లు చూసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చెపుతున్నారని పలు పార్టీల నాయకులు బహిరంగ అంటున్నారు.
వివరాల్లోకి వెళితే.,,,,,,,,,,
రాబోయే పది సంవత్సరాల్లో మక్తల్ మున్సిపాలిటీలో జనాభా కు తాగునీటికి ఇబ్బందులు పడకుండా సరిపడే విధంగా 2012 జనాభా లెక్కల ప్రకారం15 కోట్ల ఖర్చుతో మక్తల్ మున్సిపాలిటీకీ అమృత్ జల్ 2.0 మంజూరి చేసింది. గతంలో తెరాస ప్రభుత్వం మిషన్ భగీరథ వేరుతో ప్రతి గ్రామానికి నీటిని అందిస్తామని ఈ పథకం ఎందుకని పట్టించుకోక పట్టించుకోలేదు.ఈ పథకం మంజూరై నట్టుగా “దిశ” కథనం వచ్చేవరకు పాలకమండలి ప్రస్తుత కమిషనర్ తెలియలేదు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రతిష్టాత్మకంగా తాగునీటి పథకం అమృత 2.0

మిషన్ భగీరథ ఉంది కదా అని అప్పటి పాలకులు అమృత 2-0 జల్ పథం ను వద్దనుకుని నిర్లక్ష్యం చేశారు, మక్తల్ మున్సిపాలిటీలో ప్రజలకు తాగునీటి అవస్థలు తీర్చేందుకు కెసిఆర్ ప్రభుత్వం బ్రాండ్ మిషన్ భగీరథ పథకాని ప్రవేశ పెట్టింది.కొత్తగా ఏర్పడిన మున్సిపాల్టీలో తాగునీటి సమస్య తీర్చేందుకు మిషన్ భగీరథ పథకాని ప్రారంభించింది. ప్రతిఇంటికి నీరు అందించాలని పట్టణంలో కిలోమీటర్ల మెర పైపులను వేశారు,పట్టణంలో నేతాజీనగర్. హరిజన వాడ అంబేద్కర్ నగర్.రాఘవేంద్ర కాలనీ. శబరి. సాయి టిచర్స్ కాలనీ .మైనారిటీ కాలని.లో మిషన్ భగీరథ ప్రారంభించ లేదు, కాని మిషన్ భగీరథ కాంట్రాక్టర్ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పనులు కాకున్న పూర్తై నట్టుగా కౌన్సిలర్ మీద ఒత్తిడి తెచ్చి చేతులు తడిపి వార్డుల్లో పనులు పూర్తైందన్నట్టుగా సంతకాలు చేయించుకుని బిల్లులు డ్రా చేతులు దులుపుకున్నారు. కాని మక్తల్ పట్టణ ప్రజలు తాగు నీటికి కష్టాలు తప్పలేదు.
కేంద్ర ప్రభుత్వం కోత్తగా ప్రవేశ పేట్టిన అమృత్ 2.0 పథకం కింద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోని ఎడు మున్సిపాల్టీలో ఈ పథకానికి ఎంపికైయ్యాయి.మిషన్ భగీరథ పథకం ఉన్న మున్సిపాలిటీకి ఈ పథకం అమలు కాదని నిబంధనలు ఉన్నాయి మక్తల్ మున్సిపాల్టీ లో మిషన్ భగీరథ పనులు ఆటకెక్కా యని ఇక్కడ పని చేస్తున్న ఓ ఇంజనీయర్ అధికారి ముందు చూపుతో పది సంవత్సరాల వరకు ప్రజలు తాగు నీటి సమస్య రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రస్తుత డిప్యూటీ కలెక్టర్ మయాంక్ మిట్టల్ తో చోరవ తీసుకుని మక్తల్ మున్సిపాల్టీని అమృత2.0 జల్ పథంలో చేర్చారు.
ఈ పథకం అమలుకుగాను15 కోట్లరూపాయలు మంజూరై టెండర్లు పూర్తయ్యాయి.ఈ తతంగం ఎన్నికల ముందు జరిగి నందుకు పనులు ప్రారంభం కాలేదు.అయితే ఇప్పటివరకు సంబంధిత కాంట్రాక్టర్ ఎవరన్నది.ఎమ్మెల్యే.మున్సిపల్ అధికారులు తెలియక నోరు మెదపడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

అమృత 2.0 జల్ పథంలో 15 కోట్లు మంజూరైన 50 శాతం కేంద్రము, 50 రాష్ట్ర నిదులతో ఈ పథకాన్ని అమలు చేయాలని పథకం ఉద్దేశం.ఈ పథకం ద్వారా మున్సి పాలిటీలో 1100 లక్షల లీటర్ల నీటి నిల్వ సామార్థ్యం గల 9 ఓవర్హెడ్ ట్యాంకులు,అవసరకాగా ప్రస్తుతం ఆరు ఉండగా అథనంగా మూడింటిని కోత్తగా టీచర్స్ కాలనిలో 250KL.రాయిచూర్ రొడ్డువైపు 400KL.నల్లజానమ్మ మందిరం పరిసరాలో 600KL లీటర్ల సామార్థ్యం గల ట్యాంకులను నిర్మించ నున్నటు సర్వే చేశారు.
ప్రస్తుతం మునిసిపాలిటీలో 2012 జనాభా లెక్కల ప్రకారం 8వేల హౌస్ హోల్డర్స్ ఉండగా రాబోయే పది సంవత్సరాలో మక్తల్ లో నివసించే ముప్పై వేల 9 సరిపడే విదంగా 52.5 కిలోమీటర్ల మేర పైపులైన్ వేసి ఐదు వేల పైచిలుకుల కొత్తగా కనేక్షన్లు ఇవ్వడంతో తాగు నీటి సమస్య తీర్చొచ్చని అంచనా వేశారు. రాబోయి పది సంవతసరాల్లొ ముప్పై వేల జనాభాకు తాగు నీరు అందిచే పథకాని ఎవ్వరూ పట్టించుకో కపోవడంతో అమృత 2.0జల పథకం మూలపడింది.

Join WhatsApp

Join Now

Leave a Comment