---Advertisement---

ఏజెన్సీ బోకర్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన ఉద్యోగులపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలి.

---Advertisement---

ఏజెన్సీ బోకర్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన ఉద్యోగులపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలి.

 

రిమూల్ సర్వీస్ ప్రకటిస్తూ చట్టం ప్రకారం శిక్షించాలి.

 

మూడవత్ శంకర్ నాయక్ జిల్లా కార్యదర్శి తెలంగాణ గిరిజన సంఘం.

మెట్రో న్యూస్ అచ్చంపేట రూరల్ (డిసెంబర్ 19):

 

ఏజెన్సీ ప్రాంతం పేరుతో ఏజెన్సీ తరులు ఏజెన్సీ సర్టిఫికెట్ పొంది రంగాల్లో ఉద్యోగాలు పొందిన వారిని రిమోవెల్ సర్వీస్ ప్రకటిస్తూ చట్టపరంగా శిక్షించాలని సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులను చట్టపకారం శిక్షించాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ ప్రాంతంలో ఉన్న ఏజెన్సీ మండలాల్లో ఏజెన్సీ ఏతర గిరిజనులు ఏజెన్సీ సర్టిఫికెట్లు తీసుకొని అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందిన వారిని రిమూవ్ సర్వీస్ ప్రకటించాలని, చట్టం ప్రకారం శిక్షించాలని, సర్టిఫికెట్ జారీ చేసిన తాసిల్దారులను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించి చట్టం ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు.

గిరిజన సంఘంగా ఏజెన్సీ పేరుతో మైదాన ప్రాంత గిరిజనులు ఏజెన్సీ సర్టిఫికెట్లు లక్షల రూపాయలు చెల్లించి అక్రమ రూపంలో సర్టిఫికెట్ తీసుకొని ఫారెస్ట్ టీచర్స్ హెల్త్ డిపార్ట్మెంట్ అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందిన మైదాన ప్రాంత గిరిజనులను తొలగించి ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు న్యాయం చేసే విధంగా ఉన్నత అధికారులు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో మరియు ప్రభుత్వ పాఠశాలలో స్థానిక చదువుతున్నట్టు బోనఫైడ్లు సృష్టించి ఉద్యోగ అవకాశాలు పొందిన ఉద్యోగులను తొలగించి అర్హులైనటువంటి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఓనఫైడ్ జారీ చేసిన అధికారులు ఉపాధ్యాయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment