తెలంగాణ గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా 

తెలంగాణ గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా 

అహర్నిశలు కృషి.

 

పండగ వాతావరణంలో జిల్లాలో రాష్ట్రస్థాయి సీఎం కప్ సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలు మొదలు.

 

రాష్ట్ర మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినంగా మౌనం పాటించిన క్రీడాకారులు క్రీడాభిమానులు.

 

జిల్లాలో అంగరంగ వైభవంగా రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు మొదలు.

 

యువజన క్రీడల నిర్వహణ అధికారి నాగరాజు.

 

తెలంగాణ కెరటం

ఉమ్మడి మెదక్ జిల్లా

ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 28:

 

శనివారం మెదక్ పట్టణంలో మహిళలకు అవుట్డోర్ స్టేడియంలో మరియు పురుషులకు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలు మొదలయ్యాయని యువజన క్రీడల నిర్వహణ అధికారి నాగరాజు పేర్కొన్నారు.

ఈ క్రీడా పోటీలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ జిల్లాలో క్రీడా రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేయాలని ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు పోవాలన్నారు ఇప్పటివరకు మొత్తం 21 జిల్లాలు క్రీడా పోటీలకు రిపోర్టు చేశాయని.336 మంది పురుషులు, 320మంది మహిళలు ఈ పోటీలలో పాల్గొన్నారు అని చెప్పారు. వీరితోపాటు 82 మంది వివిధ జిల్లాల జట్టు మేనేజర్లు, కోచ్ లు మరియు 25 మంది టెక్నికల్ అఫీషియల్స్ 80 మంది వ్యాయామ ఉపాధ్యాయులు మరియు జిల్లా యువజన మరియు క్రీడా శాఖ సిబ్బంది మొత్తం 843 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని చెప్పారు ఈ పోటీలు 31-12-2024. వరకు కొనసాగుతాయని,ఈ కార్యక్రమంలో పిఈటి ల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాయకులు, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి శ్యాంసుందర్ శర్మ, ఎస్ ఏ టి జి పరిశీలకుడు భరత్ కుమార్, ఎస్ జి ఎఫ్ కార్యదర్శి రమేష్, పీడీలు దాసరి మధు, దేవేందర్ రెడ్డి, అశోక్, ప్రతాప్ సింగ్,రాజేందర్, చంద్రమోహన్, వినోద్,లతీఫ ఉంది సార్, మాలతి మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. గెలుపొందిన వారి వివరాలు పేర్కొన్నారు

మహిళల విభాగంలో ఫలితాలు

నిజాంబాద్ 11-0 కొత్తగూడెం పై గెలుపు.

సిద్దిపేట్ 11-0 పెద్దపల్లిపై గెలుపు.

వరంగల్ 16-10 తో నల్గొండ పై గెలుపు.

హనుమకొండ 13-02 ఓ హైదరాబాద్ పై గెలుపు.

రంగారెడ్డి 13-02 తో ఆసిఫాబాద్ బై గెలుపు.

మహబూబ్నగర్ 10-00. జనగాంపై గెలుపు.

జగిత్యాల్ 11-01 తో మంచిర్యాల్ పై గెలుపు.

 

పురుషుల విభాగంలో

హనుమకొండ 15-0 తో రాజన్న సిరిసిల్లపై గెలుపు.

 

మెదక్ 12-0 మేడ్చల్ పై గెలుపు.

 

హైదరాబాద్ 2-0 తో మంచిర్యాలపై గెలుపొందడం జరిగిందని ఆయన తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment