అర్హులైన పేదవారికి ఇల్లు ఇవ్వడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం

అర్హులైన పేదవారికి ఇల్లు ఇవ్వడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం

 

-దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్

 

దుబ్బాక:డిసెంబర్19,(తెలంగాణ కెరటం )

సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలంలోని అక్బర్ పేట మండల కేంద్రము లో ఇల్లు లేని వారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లో ఇల్లు లేదని దరఖాస్తు చేసుకున్నా వారి ఇంటి వద్దకు వెళ్లి ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సర్వే చేయడం జరిగింది.ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ, అక్బర్ పేట భూంపల్లి మండలంలోని అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతిపక్ష నాయకుల మాటలు విని లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ వంశీ కుమార్, మండల మహిళా అధ్యక్షురాలు కూతురి సుమలత, ఇందిరమ్మ కమిటీ మెంబర్లు బాల్తే వెంకటేశం, కూతురి చందు, తిప్పనబోయిన విజయ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment