మద్దిమడుగు ఆంజనేయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దంపతులు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 15):
నల్లమల ప్రాంతంలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం , పదర మండలం మద్దిమడుగు గ్రామంలో వెలసిన పిలిస్తే పలికే భక్తుల కొంగుబంగారం గా పిలువబడుతున్న శ్రీ పబ్బతి మద్దిమడుగు ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగున్నాయి.ఈ బ్రహ్మచావాలకు ముఖ్య అతిథిగా నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దంపతులు పాల్గొని
శ్రీ పబ్బతి ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు
శ్రీ హనుమాన్ గాయత్రి మహా హోమ పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించి నిర్వహించారు.సీతారాముల కళ్యాణ మహోత్సవం గరుడవాహన సేవ నిన్న రాత్రి 9:30 నిమిషాలకు హనుమాన్ మహా పడిపూజ కార్యక్రమం హనుమాన్ దీక్ష స్వాముల సమక్షంలో భక్తిశ్రద్ధతో అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఆదివారం ప్రత్యేక పూజలతో పాటు మన్య సూక్తములతో ఆంజనేయ స్వామి వారికి 108 కలశములచే మహా స్నానం నిర్వహిoచ్చారు.ఈ కార్యక్రమంలో మద్దిమడుగు దేవస్థాన కమిటీ చైర్మన్ దేశవత్ రాములు నాయక్, ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హనుమాన్ మాలాద ధారణ భక్తులు ప్రజలు పాల్గొన్నారు..