అంగన్ వాడి కేంద్రాలలో అయాలు లేక యిబ్బంది పడుతున్న టీచర్స్ పిల్లలు
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి
పెన్ పహాడ్ మండలం లోని చాలా గ్రామాలలో మూడు నెలల క్రితం అయాలు రిటైర్ అయ్యారు వారి స్థానం లో కొత్త అయాలను మూడు నెలలు గడుస్తున్నా నియమించక పోవడం తో పిల్లలు చాలా యిబ్బంది పడుతున్నారు మండలం లోని ధర్మాపురం గ్రామంలోని అంగాన్ వాడీ కేంద్రాన్ని . సావిత్రి భాయి పులే జయంతి సందర్భముగా తెలంగాణ కెరటం ప్రతినిధి సంధర్షించగా అక్కడ అయాలు లేక పోవడం తో తామే వంట చెయ్యడం పిల్లలకు పెట్టటం , చదివియ్యడం , ఆటలు అడిచడం , అన్ని తానే చుసుకోవడం యిబ్బంది పడుతున్నామని బోజనానికి గత నెల మెనూ ప్రకారం పప్పు , గ్రుడ్లు టైమ్ కి అందక పోవటం తో పిల్లలు యిబ్బంది పడుతున్నారు ఇకనైనా అధికారులు మెనూ ప్రకారం పప్పు , గ్రుడ్లు అందేలా చూడాలని. అయాలు లేక పిల్లల ఆలనా పాలనా చూసుకొనే వారు లేక పూర్వ ప్రాథమిక విద్య కు ఇబ్బందికరంగా వుంటుందని . చెప్పుతున్నారు . మండలంలోని గ్రామాలలో అయాలు లేనిచోట వెంటనే అధికారులు స్పందించి వీలైనంత త్వరలో అయాలని నియమించాలని కోరుకుంటున్నారు . అలాగే అంగన్ వాడీ భవనానికి అధికారులు సున్నం వేయించాలని కోరుకుంటున్నారు …“