---Advertisement---

పోలీస్ స్టేషన్ స్ట్రాంగ్ రూమ్ నుండి ప్రశ్నపత్రాల తరలింపు ప్రక్రియను,గ్రూప్-2 పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.

---Advertisement---

పోలీస్ స్టేషన్ స్ట్రాంగ్ రూమ్ నుండి ప్రశ్నపత్రాల తరలింపు ప్రక్రియను,గ్రూప్-2 పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.

 

కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ గ్రూప్-2 పరీక్షలు ప్రారంభం,

నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 16):

 

నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్ నుండి మధ్యాహ్నం నిర్వహించే గ్రూప్ 2, పేపర్, 4 పరీక్షకు నిర్వహించే ప్రశ్నపత్రాల తరలింపు ప్రక్రియను, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ దేవ సహాయం, అదనపు ఎస్పి రామేశ్వర్, సంబంధిత అధికారుల సమక్షంలో 5 రూట్ల వారీగా ప్రశ్నాపత్రాల తరలించే ప్రక్రియను జిల్లా కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షించారు.ప్రశ్నపత్రాల తరలించే వాహనంతో పాటు కలెక్టర్ బయలుదేరి, పట్టణంలోని సాధన డిగ్రీ కాలేజ్ పరీక్ష కేంద్రం వరకు వెళ్లి, ప్రశ్న పత్రాలను పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి, మధ్యాహ్నం పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలను ఎన్ని గంటలకి ఓపెన్ చేస్తారని అధికారులతో కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.అనంతరం సాధన డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఆదివారం ప్రారంభం అయ్యాయి. జిల్లా కేంద్రంలోని సాధన డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అన్నది గమనించి పలు సూచనలు చేశారు. కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ సాఫీగా పరీక్షలు నిర్వహించాలని అన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎ ఒక్కరి సెల్ఫోన్లను అనుమతించొద్దని పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భద్రత చర్యలను అత్యంత జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఆది, సోమవారాలలో ఉదయం, మధ్యాహ్నం చొప్పున మొత్తం నాలుగు సెషన్లలో జరిగే గ్రూప్-2 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలను పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment