సకాలంలో రుణాలు మంజూరు చేసి జిల్లా ప్రజల ఆర్థికాభివృద్ధిలో పాలుపంచుకోవాలి. కలెక్టర్.
మహిళా సాధికారత లక్ష్యంగా స్వయం సహాయక మహిళా సంఘాలకు రుణాలు అందించాలి.
జిల్లాలో రైతుల రుణమాఫీ
సమర్థవంతంగా అమలులో బ్యాంకులు యొక్క సేవా దృక్పథం అభినందనీయం.
కలెక్టరేట్ కార్యాలయంలో బ్యాంక్ కంట్రోలర్స్ డిసిసి,డీఎల్ఆర్సి సమావేశంలో పాల్గొన్న.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి నవంబర్ 29:
శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశ హాలులో సంబంధిత వివిధ బ్యాంక్ కంట్రోలర్ తో జిల్లాలోని డీసీసీ / డిఎల్ఆర్సి మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల రుణమాఫీ అమలులో బ్యాంకర్ల సేవా దృక్పథం అభినందనీయమని ఇదే వర వడి కొనసాగిస్తూ బ్యాంకర్ల లక్ష్యాలను సాధించాలన్నారు.జిల్లాలో వ్యవసాయ రంగానికి,మహిళా సాధికార లక్ష్యంగా రుణాలు మంజూరుకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని,గత సంవత్సర లక్ష్యాల కంటే మెరుగైన లక్ష్యాలు సాధించడానికి చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రాధాన్యతా రంగానికి బ్యాంకులు పూర్తి లక్ష్యాలు సాధించడానికి కృషి చేయాలన్నారు. పీఎం విశ్వకర్మ పథకానికి సంబంధించి., ఎస్సీ ,మైనారిటీ గిరిజన సంక్షేమ శాఖ రుణ లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు జిల్లా వార్షిక ప్రణాళిక ప్రకారం వివిధ రంగాలలో 5,857 కోట్లు రుణాల లక్ష్యం ఉండగా, 2,646 కోట్లు (45.18 శాతం) రుణాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.ఇందులో వ్యవసాయతర రుణాల లక్ష్యం Rs.3671 కోట్లు ఉండగా,మెదక్ జిల్లాలో Rs.1663 కోట్లు (45.30%) మంజూరు చేయటం జరిగిందన్నారు.పంట రుణాల లక్ష్యం.2,274 కోట్లు ఉండగా, మెదక్ జిల్లాలో 973 కోట్లు (42.78 శాతం) మంజూరు చేశారన్నారు. కలెక్టరుప్రణాళిక ప్రకారం రుణాల లక్ష్యాన్ని మంజూరు చేయాలని ఆదేశించారు.ఈ మీటింగ్ లో అదనపు కలెక్టర్ రెవిన్యూ నగేష్ డి ఆర్ డి ఓ శ్రీనివాస రావు, ఎల్డీఎం నరసింహ మూర్తి, డీడీఎం నాబార్డ్ – శ్రీ కృష్ణ తేజ, ఎల్డిఓ ఆర్బీఐ ఎస్ ఎం టి పల్లవి, ఆర్సేటీ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్, వివిధ వాణిజ్య, సహకార ఆర్ ఆర్ బి బ్యాంకుల కంట్రోలర్స్, ఇతర సీనియర్ డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.