---Advertisement---

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేజీబీవీ విద్యార్థులను పరామర్శించిన జిల్లా విద్యాధికారి.

---Advertisement---

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేజీబీవీ విద్యార్థులను పరామర్శించిన జిల్లా విద్యాధికారి.

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 10):

 

నాగర్ కర్నూల్ కేజీబీవీలో ఇంటర్మీడియట్ చదువుతున్న ముగ్గురు విద్యార్థినిలు ఆదివారం ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని తీసుకొని అస్వస్థకు గురియై నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన కేజీబీవీ విద్యార్థులు ఆస్పత్రిలో కోరుకుంటున్నారు విద్యార్థులను మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రమేష్ కుమార్ పరామర్శించి విద్యార్థుల ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూఈనెల తొమ్మిదో తేదీన పలు వార్త దిన పత్రికల్లో కేజీబీవీ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థకు గురయ్యారని మీడియాలో వార్తలు వచ్చాయని, అందులో వాస్తవం లేదని కేజీబీవీ లో వండిన ఆహార పదార్థాలను సేవించి అస్వస్థకు గురి కాలేదని, ఆదివారం ఇంటి నుండి తెచ్చుకున్న ఎగ్ రైస్ తినడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడ్డాయని, సిబ్బంది స్పందించి ప్రభుత్వ జర్నల్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందజేయడం జరిగిందని డీఈవో తెలిపారు.కేజీబీవీలో అందించిన ఆహారాలను పదార్థాలను డాక్టర్లు పరిశీలించి నిర్ధారించారని, కేజీబీవీ లో విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాల వల్ల కాదని బయట నుండి తెచ్చిన ఆహార పదార్థాల వల్లనే విద్యార్థులకు అస్వస్థకు గురయ్యారని, ప్రస్తుతం ఆ విద్యార్థినిల ఆరోగ్యం పూర్తిస్థాయిలో మెరుగుపడిందని డిఇఓఈ సందర్భంగా తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment