*ఎండిపోతున్న పల్లె ప్రకృతి వనం*
*తెలంగాణ కెరటం నందిగామ*
పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కానీ, క్షేత్రస్థాయిలో పల్లె ప్రకృతి వనాల పరిస్థితి అధ్వానంగా కనిపిస్తోంది. నందిగామ మండలం లోని అంతిరెడ్డిగూడ గ్రామ పంచాయతీ పరిది లోని పల్లె ప్రకృతి వనం నీళ్లు లేక మొక్కలు ఎండిపోతున్నాయి. రహదారికి సమీపంలో ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని తో పాటు చుట్టు ప్రహరీ గోడ నిర్మాంచక పోవడం పై .. రహదారి మార్గాన వెళ్లే ఉన్నతాధికారులు పటించుకోవడం లేదు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఎంత వరకు సమంజసం అని అధికారులపై ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు కూడా అధికారుల పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పల్లె ప్రకృతి వనం లో చెత్త చెదారాన్ని తొలగించి, నీటి సౌకర్యాన్ని కల్పించి పల్లె ప్రకృతిలోని మొక్కల్ని కాపాడవలసిందిగా గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.