---Advertisement---

ఐదవ భారతీయ సైన్స్ టెక్నో ఫెస్టివల్ 2025 బిఎస్టిఎఫ్ ఈవెంట్ జనవరి 9 నుండి 11 వరకు జరుగుతుంది.

---Advertisement---

ఐదవ భారతీయ సైన్స్ టెక్నో ఫెస్టివల్ 2025 బిఎస్టిఎఫ్ ఈవెంట్ జనవరి 9 నుండి 11 వరకు జరుగుతుంది.

 

జీవశాస్త్ర ఉపాధ్యాయుడు టి రాజశేఖర్రావు.

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 18):

 

ఐదవ భారతీయ సైన్స్ టెక్నో ఫెస్టివల్ 2025 బి ఎస్ టి ఎఫ్ ఈవెంట్ మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో భోపాల్ రాజదాని కి దగ్గర లో ఉన్న బూర్హాన్ పూర్ లో జనవరి నెల 9 వ తేదీ నుండి 11 వ తేదీ వరకు జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా చిన్న ముద్దనూరు పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న టి రాజశేఖర్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్య క్రమానికి దేశంలో వున్న ప్రముఖ శాస్త్రవేత్త లు పాల్గొంటున్నారని,ఇది విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు శాస్త్రీయ దృక్పథం, అవగాహన కల్పించడం కోసం దేశంలో దాదాపు 20 రాష్ట్రాలలో చురుకుగా పనిచేస్తూ దేశ వ్యాప్తంగా అనేక సైన్స్ కార్య క్రమాలు నిర్వహించడం లో భాగంగా భారతీయ సైన్స్ టెక్నో ఫెస్టివల్ ను నిర్వహిస్తారు. నేషనల్ టీచర్ సైంటిస్ట్ కౌన్సిల్, రామన్ సైన్స్ టెక్నాలజీ ఫౌండేషన్ , శ్రీ సర్దార్ పటేల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ఇండియన్ ప్లానెటరీ సొసైటీ (ముంబయి) , బాబా నేషనల్ రీసెర్చ్ ఆకాడమి నేషనల్ చిల్డ్రన్ మాథ్స్ అకాడమీ (ఇండియా), డాక్టర్ అబ్దుల్ కలామ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ సైంటిస్ట్ ఇండియా మొదలగు సంస్థలు కలిసి దేశ వ్యాప్తంగా విద్యార్థుల మధ్య సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నారని .దీనిలో ఒక కార్య క్రమంలో భాగంగా దేశంలో ఒకే ఒక జాతీయ ఉత్తమ సైన్స్ ఉపాధ్యాయ అవార్డును మన నాగర్ కర్నూల్ జిల్లా వాసి చిన్న ముద్దు నూర్ పాఠశాల జీవ శాస్త్ర ఉపాధ్యాయుడు తల్పు నూర్ రాజశేఖర్ రావు కి ఇవ్వడం జరుగుతుందని, రామన్ సైన్స్ టెక్నాలజీ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ సివి జోషి , ఇస్రో శాస్త్రవేత్త దిలీప్ భట్ , ఆల్ ఇండియా మాథ్స్ గురు గా పిలువ బడే బి ఎన్ రావు ,చేతుల మీదుగా రాజశేఖర్ రావు ఈ ఆవార్డు ను అందు కోబుతున్నారని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా విద్యశాఖాధికారి శ్రీ రమేష్ కుమార్ ఈ విజయాన్ని ప్రశంసించారని తెలిపారు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment