గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాములను ఉద్దేశపూర్వకంగా అవమానించిన మతోన్మాదులు

గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాములను ఉద్దేశపూర్వకంగా అవమానించిన మతోన్మాదులు

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి డిసెంబర్

గేజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాములు సార్ ను ఉద్దేశపూర్వకంగా అవమానపరిచిన అయ్యప్ప మాల ముసుగులో ఉన్న మతోన్మాదులను వెంటనే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని .ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం.నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు జక్క బాలకృష్ణయ్య. సభ్యులు సామ అనిల్ అన్నారు.
రంగారెడ్డిజిల్లాలోని,మహేశ్వరం మండలం, తుక్కుగూడ గ్రామ ఉన్నత పాఠశాల
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాములు పై, మతోన్మాద మూకలు భక్తి ముసుగు వేసుకుని ఉద్దేశపూర్వకంగా చేసిన దాడిని, తీవ్రంగా ఖండిస్తున్నాం తుక్కుగూడ పాఠశాలలో డిసెంబర్ 21వ తేదీన, విద్యార్థులను లెక్కలు అడిగిన సందర్భాన సరిగా అప్పచెప్పనందుకు, విద్యార్థిని పక్కకు నిలబెట్టిన కారణంగా “కాలితో అయ్యప్ప మాల వేసుకున్న స్టూడెంట్ ను తన్నాడనే”దుష్ప్రచారం చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, 23 వతేదీ వరకు కొంత మందిని సమీకరించి, ప్రణాళిక బద్ధంగా ప్రధానోపాధ్యాయుని పై దాడి చేసి, క్షమాపణ చెప్పినా వినకుండా, అక్కడున్న మాలను ధరించిన విద్యార్థి,మరియు, ఇతర స్వాములు అనబడే వారి కాళ్లకు మొక్కించడం అత్యంత హేయమైన చర్య అని. దాడికి గురైన బాధిత టీచర్ దళితుడు కావడం ఇక్కడ గమనార్హం. ఆ పాఠశాలలో వందలాది మంది విద్యార్థులు ఉండగా ఈ సంఘటన జరగడం ఉపాధ్యాయుల యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాకుండా ఈ సంఘటన జరిగినప్పుడు విద్యార్తి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు,లేకుండా హిందుత్వసంఘాలు,స్వాములు అనే వాళ్ళు
ఈ విషయాన్ని పూర్తిగా తమ పరిధిలోకి తీసుకొని , కొట్టడం,చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని,భయభ్రాంతులకు గురి చేయడం, చట్ట వ్యతిరేకమైనదని అమానవీయమైనది.
విద్యార్థులు తమ కాళ్ళ మీద తాము నిలబడాలని, సమాజంలోని ఎలాంటి మూఢ విశ్వాసాలకు బానిసగా మారకుండా, ఆత్మ విశ్వాసం తో జీవించాలని బోధించే ఉపాధ్యాయుల చేతనే విద్యార్థుల కాళ్లు మొక్కించడం, దాని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం,కుట్రపూరితంగా ప్రణాళిక బద్ధంగా చేసిన భౌతిక, మానసిక దాడిగా పరిగణిస్తున్నామని అన్నారు.
అంతే కాకుండా దాడికి సూత్ర దారులైన నిందితులపై, ఉపాధ్యాయుడు రాములు పెట్టిన కేసును అక్కడి పెద్దలంతా ఒత్తిడి చేసి, విరమించుకునేలా చేయడం కూడా అత్యంత దుర్మార్గమైనదిగా స్పష్టం చేశారు.పాఠశాలల్లో మతోన్మాదుల జోక్యం సరికాదు అని అన్నారు. అయ్యప్ప మాల ధరించిన స్వాములు అత్యంత నిష్టతో భక్తి శ్రద్ధల నియమ నిబంధనలతో ఉంటారు పొరపాటున నోరు జారితే వెంటనే స్వామి శరణం అని వెనక్కి తీసుకుంటారు కానీ ప్రస్తుతం మాలలు ధరించిన కొంతమంది స్వాములలో అలాంటి భక్తి కనిపించడం లేదని .కనుక ఈ దాడి విషయాన్ని ప్రభుత్వం, పోలీసులు సీరియస్ గా తీసుకొని నిందితులపై కేసులను నమోదు చేసి,వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment