*సమాచార హక్కు చట్టంపై ప్రభుత్వం భరోసా కల్పించాలి*
తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో నవంబర్ 27:
సమాచార హక్కుచట్టంపై ప్రభుత్వం సామాన్య ప్రజలకు భరోసా కల్పించాలని బత్తుల మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లోని సమాచార హక్కు చట్టం సాధన కమిటి జాతీయ కార్యాలయంలో జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్ మరియు రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు సూర స్రవంతి నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ కాల క్రమేణ ఆర్టీఐ యాక్ట్ చట్టం అంతరించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం సమాచారాన్ని వెల్లడించరు కారణం సక్రమంగా జరగాల్సిన పనులు అడ్డదారిలో జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత అధికార యంత్రాంగంలో జవాబుదారి తనంతో ప్రజలు కోరిన సమాచారాన్ని 30 రోజుల కాలంలో సమాచారం ఇవ్వాలని కోరారు. ఆయా శాఖల పౌరసమాచార అధికారులతో జిల్లా కేంద్రంగా కమిషన్ కోర్టును ఏర్పాటుచేసి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా కేసుల విచారణ ప్రక్రియ నిర్వహించి దరఖాస్తుదారుడు కోరిన సమాచారాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గుండెల రాయుడు, తెలంగాణ మహిళా కార్యనిర్వహక అధ్యక్షురాలు గంగా ప్రియ రెడ్డి,లక్ష్మి ప్రియ యాదగిరి గౌడ్,వి.దయాకర్ రెడ్డి,జి.కుమార్ యాదవ్, లగ్గొని శ్రీనివాస్ గౌడ్,నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.