ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు గుర్తింపు పారదర్శకంగా ఉండాలి.
క్షేత్ర స్థాయి పర్యటన లో సాగు చేయని భూములని జాగ్రత్తగా గుర్తించాలి..
జిల్లా అదనపు కలెక్టర్
పి రాంబాబు .
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి
జనవరి
సూర్యాపేట జిల్లా లోని జనవరి 26 . నుండి చేపట్టబోయే ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపు పారదర్శకంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. గురువారం హుజూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు,నూతన రేషన్ కార్డుల మంజూరు పథకాలపై ఆర్ డి ఓ శ్రీనివాస్ లు తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డులు లబ్ధిదారుల గుర్తింపు ని క్షేత్ర స్థాయి పర్యటనలో అర్బన్ లో మున్సిపల్ కమిషనర్, రూరల్ లో మండల పరిషత్ అభివృద్ది అధికారి జాగ్రత్తగా పరిశీలించి ఎంపిక చేయాలని సూచించారు.
అంతకుముందు హుజూర్ నగర్ మండలం అమరవరం గ్రామం లో జరుగుతున్న సేద్యం చేయని భూముల సర్వే ని అదనపు కలెక్టర్ పి రాంబాబు పరిశీలించారు.సాగు చేయని భూముల గుర్తింపు విషయం లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా సర్వే చేపట్టాలని ఏమైనా అనుమానాలు ఉంటే పై అధికారుల ద్వారా తెలుసుకోవాలని సూచించారు.సాగు చేయని భూములని గుర్తించి అట్టి పట్టాదారులను రైతు భరోసా పథకంకు అనర్హులుగా గుర్తించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్, తహసీల్దార్ నాగార్జున రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, ఎంపిడిఓ కార్యాలయ సూపరిటీడెంట్ శ్రీనివాసరెడ్డి,మండల వ్యవసాయ అధికారి స్వర్ణ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.