మాదిగ,మాదిగ ఉపకులాలకు సబ్బండ వర్గాల మద్దతుకే జేఏసీ ఏర్పాటు
–మర్కుక్ మండల కన్వీనర్ కో కన్వినర్ లు మొండి బిక్షపతి,కర్రోళ్ల నర్సింలు
తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి జనవరి 13,
హైదరాబాద్ పట్టణంలో ఫిబ్రవరి 7 తారీఖున మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ దండోరా జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో తలపెట్టిన వెయ్యి గొంతులు,లక్ష దప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మాదిగ,మాదిగ ఉపకులాల పైన ఉందని మర్కుక్ మండల మాదిగ జేఏసీ కన్వీనర్ మొండి బిక్షపతి,కో కన్వీనర్ కర్రోల్ల నర్సింలు లు పిలుపునిచ్చారు.సోమవారం నాడు మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామంలో మాదిగ జేఏసీ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్గీకరణ చివరి ఘట్టంలో ఉన్నందున సబ్బండ వర్గాల మద్దతును ఏకం చేయడానికి ఈ కమిటీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో పనిచేస్తుందన్నారు.ఈ సభను విజయవంతం చేయడానికి జే ఏ సి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన కమిటీలను నిర్మాణం చేస్తామన్నారు.ఫిబ్రవరి 7న జరిగే ఈ కార్యక్రమం విజయవంతం లక్ష్యంగానే పనిచేయడం జరుగుతుందన్నారు.మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో పనిచేసిన నేతలు వయసుకు అతీతంగా అందరిని కలుపుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.ఇంటికి ఒక దప్పు ఊరికి ఒక బస్సుతో బయలుదేరాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జగదేవపూర్ మండల జేఏసీ అధ్యక్షులు మాసపాక యాదగిరి,అధికార ప్రతినిధి జంగనీ బాలకృష్ణ,జగదేవ పూర్ మండల జేఏసీ ఉపాధ్యక్షులు మరాఠీ కృష్ణమూర్తి,జేఏసీ నాయకులు తుప్ప నాగరాజు తదితరులు పాల్గొన్నారు.