---Advertisement---

అటుడికిన మాగనూరు, విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీ నాయకులు అరెస్టులు,

---Advertisement---

మాజీ ఎమ్మెల్యే ను వెంటనే విడుదల చేయాలని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా,

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ ఎస్పీ,

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి,

నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండల కేంద్రంలో గత ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం విద్యార్థులు అస్వస్థలకు గురవుతున్నారు, వీటన్నింటికీ బాధ్యత వహిస్తూ అధికారులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మరి కొంతమంది టిఆర్ఎస్ నాయకులను తెల్లవారుజామునే అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు, 12 గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టర్ సితాపట్నాయక్ జిల్లా యోగేష్ గౌతమ్ విద్యార్థులలో కలిసి భోజనం చేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థిని తల్లిదండ్రులు విద్యార్థులు ఎవరు రావలసిన అవసరం లేదని పూర్తి సమగ్ర విచారణ జరిపిస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు, అంతకుముందు బిజెపి రాష్ట్ర నాయకుడు నాగరావు నామాజీ, పిడిఎస్యు రాష్ట్ర నాయకుడు ఏబీవీపీ జిల్లా నాయకులు వినయ్, తదితరులు వేరువేరుగా మాగనూరు మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు వీరందరినీ పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు, పాఠశాల ఆవరణంలో 144 సెక్షన్లు విధించినట్లు అధికారులు తెలిపారు, ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ తో విద్యార్థుల బాధపడుతుంటే రాజకీయాలు మానుకొని అందరూ కలిసికట్టుగా జరిగిన సంఘటనను పునరావృతం కాకుండా పూర్తి సమగ్ర విచారణ జరిపించాలని మక్తల్ ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహించారు, ఏది ఏమైనాప్పటికీ పూర్తి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా జిల్లాస్థాయి రాష్ట్రస్థాయి అధికారులు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి పాఠశాలలను రాష్ట్రవ్యాప్తంగా తనిఖీ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు,

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment