టీవీ9 జర్నలిస్ట్ విలేకరిపై దాడిని తీవ్రంగా ఖండించిన అచ్చంపేట ప్రెస్ క్లబ్ సభ్యులు.
మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలని ఆర్డిఓ డిఎస్పి కి వినతి.
తెలంగాణ కెరటం అచ్చంపేట (డిసెంబర్ 11):
సినీ నటుడైన మంచు మోహన్ బాబు ఇంటివద్ద గత మూడు రోజులుగా జరుగుతున్న కుటుంబ గొడవల నేపథ్యంలో కవరేజ్ కోసం వెళ్ళిన టీవీ9 వీడియో జర్నలిస్ట్ పై మంగళవారం రాత్రి సినీ నటుడు మోహన్ బాబు ఆగ్రహంతో ఊగుతూ మైక్ లాక్కుని దాడి చేసి కొట్టడాన్ని అచ్చంపేట ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా బుధవారం అయ్యప్ప మాలలో ఉన్న టీవీ9 జర్నలిస్ట్ పై దాడికి పడబడ్డ సినీ నటుడు మోహన్ బాబు పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవోకు, స్థానిక డిఎస్పి కి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.