సాంఘిక సంక్షేమ స్కూల్ తో పాటుగా ప్రభుత్వా ఆస్పత్రి ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే.
_నేను కూడా నా చిన్ననాటి చదువులు సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదివాను నంటున్న ఎమ్మెల్యే.
ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.
తెలంగాణ కెరటం అచ్చంపేట (డిసెంబర్ 19):
అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలను మరియు ప్రభుత్వ ఆస్పత్రిని గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూవిద్యార్థులు లక్ష్యసాధన కోసం కృషి చేయాలని,కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని,విద్యార్థి దశలోనే మంచి మార్గం ఎంచుకొని లక్ష్య సాధనకు కృషి చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని,విద్యార్థుల క్రమశిక్షణ అలవర్చుకొని ప్రణాళిక బద్దంగా ఇష్టపడి చదువుతూ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం పాఠశాలల్లో గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అనేక పథకాలు అమలుపట్టుకున్నది ప్రతి ఒక్కరు వాటిని సద్వినియోగ కోవాలని,గతంలో ఎన్నడూ లేని విధంగా నల్లమల్ల ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలను పెంచి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.ప్రతి వ్యక్తికి తెలివితేటలు ఉంటాయని దాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.విద్యార్థులు సన్మార్గంలో నడుస్తూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళిక బద్ధంగా చదువుకుంటూ ముందుకు సాగుతూ లక్ష్యాన్ని చేరుకోవాలని,నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు వివిధ గురుకుల పాఠశాలలో పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ప్రతిభా కనబరిచిన ముగ్గురు విద్యార్థులకు బంగారు వెండి కాంస్య పథకాలను సిబిఎం ట్రస్టు నుండి వేరువేరుగా అందజేయడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.గురుకులంలో చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకున్న వారి ఫోటోలను పాఠశాలలో విద్యార్థులు స్ఫూర్తిదాయకంగా నిలిచే విధంగా ఉంచాలని ఆదేశించారు.గురుకులాల విద్యార్థుల కు ప్రభుత్వం ఎంతో ఖర్చుతో వసతులు కల్పిస్తున్న సాధారణ పాఠశాలల మాదిరిగానే ఫలితాలు రావడం దురదృష్టకరమని ఇప్పటినుంచి అయినా విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకుని మంచి ఫలితాలు( ఎంబిబిఎస్, ఐఏఎస్, ఐపీఎస్) పొందే విధంగా ఉపాధ్యాయ బృందం ప్రణాళిక బద్దంగా కృషి చేయాలని సూచించారు.విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు.అనంతరం ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వాసుపత్రిలో మౌలిక వసతిలో కల్పనకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలోమండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు మాజీ వైస్ ఎంపీపీ నారాయణ గౌడ్ ,జ్ఞానేశ్వర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పూజారి వెంకటయ్య, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివ తదితరులు పాల్గొన్నారు.