---Advertisement---

సబ్ డి ఎల్ సి సమావేశం ఏర్పాటుచేసిన ఎమ్మెల్యే.

---Advertisement---

సబ్ డి ఎల్ సి సమావేశం ఏర్పాటుచేసిన ఎమ్మెల్యే.

 

ఎమ్మెల్యే డాక్టర్ ధన్యవాదాలు

డీసీసీ వైస్ ప్రెసిడెంట్

అడ్వకేట్ కొయ్యల శ్రీనివాసులు.

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 16)

 

జాతీయ పుల్ల సంరక్షణ ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పునరావాస పథకంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండలం పరిధిలోగల వటవ ర్లపల్లి గ్రామాన్ని, కొల్లాపూర్ తాలూకా పెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామ సమీపంలోకి మార్చడానికి సబ్ డిఎల్సి ఏర్పాటు చేసినందుకు గ్రామస్తులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కి సోమవారం ధన్యవాదాలు తెలియజేశారు.ఈ పథకంలో భాగంగా ఈ పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి 5 ఎకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ నిర్మాణం చేసి ప్రభుత్వం ఇస్తుందని, సబ్ డిఎల్సి సమావేశంలో సమావేశ అధ్యక్షులుగా వ్యవహరించిన ఆర్డీవో మాధవి లత తెలియజేశారు. సోమవారం రీలొకేషన్ ప్రాసెస్ లో భాగంగా ఆర్డీఓ అచ్చంపేట మాధవి అధ్వర్యంలో సబ్ డివిజనల్ కమిటీ (ఎస్ డి ఎల్ సి )ఆమోదం తెలిపిందని. ఈ సమావేశం లో ఎఫ్డీఓ రామూర్తి గారు, హైటికాస్ బాపురెడ్డి, రేంజర్ గురు ప్రసాద్ ,సెక్షన్ ఆఫీసర్స్ ధర్మ నాయక్, రామ ఆంజనేయులు మరియు గ్రామ పునరావాస సమితి కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు.ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న ఈ కమిటీ మొత్తానికి అయిపోయింది, ఇది మన రీలోకేషన్ ప్రాసెస్ అతిపెద్ద విజయం. దీని కోసం సహకరించనిప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, కమిటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment