పాత పద్ధతులు కొనసాగించాలి.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 23):
ఎఫ్ ఆర్-22బి విషయంలో డాటా హైదరాబాద్ ఇచ్చిన క్లారిఫికేషన్ పై పునఃసమీక్ష జరిపి పదోన్నతి పొందిన ఉద్యోగ ఉపాద్యాయులకు మేలు చేయాలని జిల్లా పి ఆర్ టి యు తెలంగాణ అధ్యక్షులు జి. లక్ష్మి నారాయణ, ప్రధాన కార్యదర్శి ఎస్. సాయిరెడ్డి లు ప్రభుత్వన్ని కోరినారు.పదోన్నతి యొక్క వేతన స్థిరీకరణ నిర్ణయించు సందర్భంలో ఉద్యోగికి మేలుజరిగే పద్దతిలో చేయవలసి ఉన్నది. మేలు జరిగే పద్దతిని ఎంచుకోవటం ఉద్యోగి హక్కు. మేలు జరిగే పద్దతిలో వేతన స్థిరీకరణ చేయటం డి డి ఓ విధి.కానీ
ఇటీవల కాలంలో వెలుబడిన డాటా హైదరాబాద్ వారి లేఖ, సంఖ్య ఎల్ ఆర్ నెంబర్ ఎఫ్ 2/1068/2022, తేదీ:29.09.2024 ద్వారా ఇవ్వబడిన సూచన ఉపాధ్యాయ , ఉద్యోగులకు నష్టం చేసేదిగా ఉన్నది.24 సం|| నిండి, 24 సం|| స్కేలు తీసుకోకుండా ఉన్నవారికి ఎ ఫర్-22 బి వర్తింపచేయకూడదని ఇచ్చిన సూచన ఉద్యోగ, ఉపాద్యాయులకు నష్టాన్ని కలిగిస్తున్నది. మరియు ఉద్యోగికి జరిగే లాభాన్ని అడ్డుకుంటున్నది.అంటే ఉద్యోగి కి ఆర్థికంగా చాలా నష్టపోయే అవకాశం ఉన్నది.. ఉద్యోగి హక్కులలో జ్యోక్యం చేసున్నట్టు గ ఉంది. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదని,కావున ఈ ఉత్తర్వులపై పునః సమీక్ష జరిపి ఉద్యోగికి మేలు జరిగే కోణంలో వేతన స్థిరీకరణ జరుగునట్లు, 24 సం|| స్కేలు తీసుకోకుండా ఉన్న వారికి ఎఫర్-22 బి వర్తింపు చేసేలా తగు ఉత్తర్వులు ఇప్పించ వలసినదిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.