తెలంగాణ తల్లికి అపచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్తారు
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 10 :
తెరాస ప్రభుత్వ హయాంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని, తెలంగాణ చరిత్ర మేరకు ఏర్పాటు చేయించడం జరిగిందని, మళ్లీ తల్లి తెలంగాణ విగ్రహం పేరుతో, తెలంగాణ చరిత్ర తెలియని కాంగ్రెస్ ప్రభుత్వం, నూతన తెలంగాణ విగ్రహం పేరుతోప్రతిష్టించి,తెలంగాణ తల్లికి, తెలంగాణ ప్రజలకు,తెలంగాణ చరిత్రకుఅపచారం కాంగ్రెస్ ప్రభుత్వం, నేతలు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటు చేసి తెలంగాణ తల్లికి అవమానపరిచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు, మహిళలు గుణపాఠం చెబుతారనిమోర్తాడ్, వేల్పూర్, మండలాల బిఆర్ఎస్ పార్టీ నాయకులుఅన్నారు. మంగళవారం రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన తెలంగాణ తల్లివిగ్రహం పట్ల నిరసనగా, నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి,మోర్తాడ్,వేల్పూర్ మండలాల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాలభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వేల్పూర్, మోర్తాడ్ మండలాల టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ,తెలంగాణ ప్రభుత్వం చరిత్ర తెలవకుండా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసి,తెలంగాణ తల్లిని అవమానపరిచి, అపచారానికి పాల్పడ్డవారిని క్షమించమంటూ టిఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లిని వేడుకున్నారు.ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంవెంటనే స్పందించిగతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని యధావిధిగా అదే స్థానంలో ప్రతిష్టించాలని మోర్తాడ్, వేల్పూర్, మండలాల టిఆర్ఎస్ డిమాండ్ చేశారు. ప్రస్తుతము ఏర్పాటు చేసినతెలంగాణ తల్లి విగ్రహాన్ని వెంటనేతొలగించాలని,లేనియెడల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన సమయంలో గుణపాఠం చెప్తారని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్, వేల్పూర్,మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నా
రు.