పోలీసు యంత్రాంగం అప్రమత్తం

పోలీసు యంత్రాంగం అప్రమత్తం

తెలంగాణ కెరటం సిద్దిపేట జిల్లా క్రైమ్ ప్రతినిధి

కొండ పోచమ్మ జలాశయంలో ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాత పడిన సంఘటన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.జిల్లా పరిధిలోని కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అంతగిరి ప్రాజెక్టు, కోమటి చెరువు, పాండవుల చెరువు, ఎల్లమ్మ చెరువు, ఇతర పెద్ద చెరువుల వద్ద హెచ్చరిక ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా పండుగ దినాలు సెలవు రోజుల్లో జిల్లా పరిధిలోని ప్రాజెక్టుల వద్ద, పెద్ద చెరువుల వద్ద, పెట్రోలింగ్ బ్లూ కోల్డ్స్ సిబ్బందితో బందోబస్తు నిర్వహణకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ డా. అనురాధ మాట్లాడుతూ ప్రాజెక్టుల సందర్శనకు వచ్చేవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాజెక్టు లోపలికి వెళ్లవద్దని సూచించారు. ప్రాజెక్టులు, చెరువులు, వాగులు, వంకలు నీళ్లతో నిండి ఉన్నందున పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు. ప్రాజెక్టుల వద్దకు వెళ్లి లోతు తెలియకుండా ఫోటోల కోసం, సెల్ఫీల కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవద్దని పోలీసు కమిషనర్ హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment