బీజేపి జిల్లా అధ్యక్ష పదవి బీసీ సామజిక వర్గానికి చెందిన పోల్ దాస్ రాముకు ఇవ్వాలి.
బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 21):
బీజేపి మరియు అనుబంధ సంఘాలతో గత 30సంవత్సరాలు గా నిబద్దతతో పని చేస్తూ వివిధ స్థాయిలో ప్రజా ప్రతిధిగా పని చేసిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పోల్ దాస్ కు బీజేపి జిల్లా పగ్గాలు ఇవ్వాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి శనివారం బీసీ కార్యాలయంలో ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో సంస్థగతంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తూ నిరంతరం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా విస్తృతంగా సేవలు అందించారాని తెలిపారు.నిస్వార్థంగా బీజేపి కోసం అహర్నిశలు కృషి చేస్తూ కార్యకర్తల సంక్షేమం కోసం పని చేస్తున్న రాము అనేక సందర్భాలలో కార్యకర్తలకు మనోదైర్యం కల్పించారాని అన్నారు.బీసీ సామజిక వర్గాల వారికి పెద్ద పీట వేస్తూ, అన్ని సామజిక వర్గాల వారిని కలుపుకొని పోయి బీజేపి బలోపేతానికి కృషి చేసిన గొప్ప వ్వక్తి అని కొనియాడారు. ఆపతి సమస్యలు ఉంటే పిలిస్తే పలికి అందుబాటులో ఉండే పోల్ దాస్ రాముకు బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే నాలుగు నియోజకవర్గాల ప్రజలను చైతన్యం చేసి బీజేపీ బలోపేతానికి కృషి చేస్తారని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి ఒక ప్రకటనలో అన్నారు.