ఖేడ్: ‘అంబేడ్కర్ ఆశయాలను ప్రధాని పాటిస్తున్నారు’
తెలంగాణ కెరటం నారాయణాఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 6
సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజకవర్గం అంబేడ్కర్ చూపిన బాటలో నడవాలని బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు సాయిరాం అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్లో అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ దిశా నిర్దేశాలను ప్రధాని మోదీ ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఖేడ్ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, పట్నం మాణిక్, సాయందర్, తదితరులు ఉన్నారు.