సివిల్ సప్లై గోదాం హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

సివిల్ సప్లై గోదాం హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి.

రెండవ రోజు నిరవధిక సమ్మె.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి జనవరి

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని సివిల్ సప్లై గోదాం హమాలీ కార్మికు ల యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో సివిల్ సప్లై పోదాం ఎదుట చేపట్టిన సమ్మె రెండవ రోజు చేరుకుంది. ఈ సమ్మెకు మద్దతుగా సిఐటియు ఎస్ఎఫ్ఐ, మహిళా సంఘం, రైతు సంఘాలు తమ మద్దతు ప్రకటించాయి.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మల్లేష్ మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలీ కార్మికుల 2023 డిసెంబర్ తో ముగిసిందని కొత్త ఒప్పందం 2024 జనవరి నుంచి కొత్త జీవో అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని,నేటికీ పరిష్కారం కాలేదని,గత మూడు నెలల క్రితం అమలు చేస్తామని సివిల్ సప్లై కమిషనర్ హామీ ఇచ్చారు నేటికీ అమలు చేయలేదని,దానిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్టాక్ పాయింట్ల దగ్గర కార్మికులు టెంట్లు వేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారని, హమాలీ కార్మికుల డిమాండ్లు క్వింటాలు బస్తకు లోడింగ్ అన్లోడింగ్ 26 నుండి 29 రూపాయల వరకు పెంచుతామని బోనస్ 6500 నుండి 7500 ఇస్తామని, స్టాక్ పాయింట్ దగ్గర ఎవరైనా మహిళ పని చేస్తే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని, ప్రతి సంవత్సరం యూనిఫామ్ కు 1300 రూపాయల నుండి 1600 వరకు కుట్టుకూలీ ఇస్తామని, ప్రభుత్వము అధికారులు హామీ ఇచ్చినా ఇంతవరకు అట్టి హామీని నెరవేర్చకపోవడంతో హమాలీ కార్మికులు పనులు బందు చేసి నిరవధిక సమ్మెకు దిగడం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సమ్మెను కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్మికులు జంగయ్య, చంద్రయ్య, బక్కయ్య, తిరుపతయ్య, రాము,మహిళా కార్మికురాలు, ప్రజాసంఘాల నాయకులు, ఎల్ దేశ నాయక్, ఏ నిర్మల, ఎండి సయ్యద్, బి రాములు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment