ఎస్ ఎస్ ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింప చేయాలి.
తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా ప్రతినిధి
కె జి వి బి లో విద్యార్థినిలకు సమ్మెతో నష్టం జరగకుండా చూడాలి.ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా అధ్యక్షులు వై మహేందర్. సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్టు లో పనిచేస్తున్న ఉద్యోగులు తమను విద్యా శాఖలో విలీనం చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో సమ్మె చేస్తున్న సందర్భంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు మద్దతు ఇచ్చి మాట్లాడుతూ చాయ్ తాగినంత సేపట్లో మీ సమస్య పరిష్కారం చేయచ్చని మాట్లాడి అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎస్ ఎస్ ఏ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల ఉద్యోగులు మళ్లీ సమ్మెలోకి దిగడం జరిగింది. దీనివల్ల ప్రధానంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల సిబ్బంది ఈ సమ్మెలో అత్యధికంగా పాల్గొంటున్నారు కేజీబీవీ లల్లో చదువుకునే విద్యార్థినిల యొక్క బోధన పూర్తిగా స్తంభించి పోవడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు.ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు చదువుకునే కేజీబీవీలకు సేవలందిస్తున్నటువంటి సిబ్బంది చాలీచాలని వేతనాలతో తక్కువ మంది సిబ్బందితో ఎక్కువ పని చేస్తూ నైట్ డ్యూటీ లను చేస్తూ విద్యార్థులతో మంచి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో అశేషంగా కృషి చేస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయునీలు, కనీసం వారానికి ఒక సెలవుకు నోచుకోకుండా పిల్లల కోసం పని చేస్తున్నటువంటి నాన్ టీచింగ్ సిబ్బంది నిత్యం సమస్యలతో యుద్ధం చేస్తూ పిల్లల కోసం రాత్రి పగలు తేడా లేకుండా పండగలు వారాంతపు సెలవులు ఎండాకాలం సెలవులు కూడా ఏనాడు ఎరగకుండా సర్వం శక్తినంత ధారపోస్తు కేజీబీవీ సంస్థల బలోపేతానికి కృషి చేస్తున్నారు మండల స్థాయిలో ఆపరేటర్లు ఇలా అనేకమంది సిబ్బంది విద్యాభివృద్ధి కోసం విద్యావ్యవస్థలో పనిచేస్తూ తమకు గౌరవప్రదమైనటువంటి వేతనం ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి విద్యా శాఖలో విలీనం చేయాలని చేస్తున్న పోరాటం ఇది. ప్రభుత్వం ఒక సామాజిక బాధ్యతగా చూడాలి వెంటనే ఉద్యోగుల యొక్క డిమాండ్లను పరిష్కారం చేసి సమ్మె విరమింప చేసి విద్యార్థినులకు తరగతులు ప్రారంభమై వారి యొక్క విద్య ముందు కొనసాగేలా చూడాలి ప్రభుత్వం మొండి పట్టుతో పోతే జరిగే నష్టం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వెనుకబడినటువంటి విద్యార్థులకు తీరని నష్టం జరిగే ప్రమాదం ఉంది.