డిసెంబర్ 1 నుంచి 9 వరకు నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలను విజయవంతం చేయాలి.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి నవంబర్ 30:
స్థానిక కలెక్టర్ కార్యాలయం లోని శనివారం అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ భుజంగరావు సంబంధిత వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు,మండల, గ్రామ ప్రత్యేక అధికారులతో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల నిర్వహణ కార్యక్రమాన్ని సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 1 నుంచి 9 వరకు నిర్వహించే ప్రజాపాలన ,ప్రజా విజయోత్సవాల్లో భాగంగా అన్ని మండల కార్యాలయాల్లో ప్రభుత్వ లోగో ఏర్పాటు చేసుకోవాలని, అన్ని కార్యాలయాలు పరిశుభ్రత పాటించాలని, విద్యుత్ దీపాలతో అలంకరించాలని, ఆయా శాఖల వారీగా విజయ గాధలను ఇవ్వాలని సూచించారు. డిసెంబర్ 7, 8, 9వ తేదీల్లో గ్రామ స్థాయిలో, 10 నుంచి 11వ తేదీల మండల స్థాయిలో, 16-21 వరకు జిల్లా స్థాయిలో సీఎం కప్ ఆటల పోటీలు నిర్వహించాలని, ఆ తదుపరి నెగ్గిన ఆటగాళ్లను రాష్ట్ర స్థాయికి పంపించాలని, ఈ మేరకు పాఠశాలల పీఈటీల సహకారంతో ఈ పోటీలను విజయవంతం చేయాలని సూచించారు.
ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు 2024 రోజు వారీ కార్యక్రమాలు.
డిసెంబర్ 1, 2024.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2వ దశకు శంకుస్థాపన కార్యక్రమాలు.
విద్యార్థుల కోసం వ్యాస రచన పోటీలు.సీఎం కప్ పోటీలు (డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు)
డిసెంబర్ 2, 2024.
16 నర్సింగ్ మరియు 28 పారా మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవం. 213 కొత్త అంబులెన్సులు ప్రారంభం.
33 ట్రాన్స్ జెండర్ క్లినిక్ల ప్రారంభం.ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్ల పై పైలట్ ప్రాజెక్టు.
డిసెంబర్ 3, 2024
హైదరాబాద్ రైజింగ్ కార్యక్రమాలు.
ఆరంగర్ నుండి జూ పార్క్ ఫ్లైఓవర్ ప్రారంభం.
రూ. 150 కోట్లు విలువైన బ్యూటిఫికేషన్ పనుల ప్రారంభం.
డిసెంబర్ 4, 2024.
తెలంగాణ ఫారెస్ట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ భవన శంకుస్థాపన.
• వర్చువల్ సఫారి మరియు వృక్ష పరిచయం కేంద్రం ప్రారంభం.
• 9,007 మందికి నియామక పత్రాల పంపిణీ.
డిసెంబర్ 5, 2024.
ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభం.
• స్వయంసహాయక గ్రూపుల్లో చర్చలు
• 3 (మేడ్చల్, మల్లేపల్లి, నల్గొండ లో) అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ప్రారంభం.
• ఘట్ కేసర్ లో బాలికల ITI కాలేజీ ప్రారంభం.
డిసెంబర్ 6, 2024
• యాదాద్రి పవర్ ప్లాంట్ లో విద్యుదుత్పత్తి ప్రారంభం.
• 244 విద్యుత్ ఉపకేంద్రాల శంకుస్థాపన.
డిసెంబర్ 7, 2024.
స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభం.
• పోలీస్ బ్యాండ్ ప్రదర్శన.
• తెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు.
డిసెంబర్ 8, 2024.
7 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాజెక్టుల ప్రారంభం.
• 130 కొత్త మీ సేవల ప్రారంభం.
• యంగ్ ఇండియా యూనివర్శిటీకి శంకుస్థాపన.
• తెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక వేడుకలు.
డిసెంబర్ 9, 2024
• లక్షలాది మంది మహిళా శక్తి సభ్యుల సమక్ష్యంలో
తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ.
• ట్యాంక్ బండ్ మీద ముగింపు వేడుకలు
• డ్రోన్ షో, ఫైర్ వర్క్, ఆర్ట్ గ్యాలరీ, వివిధ స్టాళ్ల ఏర్పాటు
కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నాగేష్, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డి విఆర్ డి ఓ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తదితరులు పాల్గొన్నారు.