నేర రహిత సమాజ నిర్మాణంలో సిసి కెమెరాల పాత్ర కీలకం.
ఒక్క సిసి కెమెరావంద మంది పోలీసులతో సమానం.
ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి జనవరి
మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిదిలోని జీడిపల్లి గ్రామంలో దోమకొండ అనిత వెంకటరమణ గారి సహకారంతో (68) సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీఉదయ్ కుమార్ రెడ్డి హాజరై ప్రారంభించినారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల, పట్టణ ప్రజలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి తమ గ్రామాలలో విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఒకవేళ దొంగతనం జరిగినా సిసి కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవచ్చని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా ఎన్నో నేరాలు అరికట్టడం జరిగిందని అన్నారు. జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాలలో,పట్టణాల్లో సిసి కెమెరాల ఏర్పాటు చేసే విధంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని, ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చని సీసీ కెమెరాలు రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని తెలిపినారు. నేరాలను అదుపు చేయడం,అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించి పట్టుకోవడంలో సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఎన్నో దొంగతనాలు, హత్యలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సిసి కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకొని కేసులు చేధించడం జరిగిందని ఈ సందర్భంగా అన్నారు. ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానంగా పని చేస్తుందని అందువల్ల సిసి కెమెరాల ప్రాధాన్యాన్ని గుర్తించాలని కోరారు.అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలోని గ్రామాల్లో ప్రదాన కూడల్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు దాతలు ముందుకు రావాలని, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తూప్రాన్ డి.ఎస్.పి వెంకట్ రెడ్డి,తూప్రాన్ సి.ఐ.రంగకృష్ణ,మనోహరాబాద్ ఎస్.ఐ.సుభాష్ గౌడ్ ప్రజా ప్రతినిధులు, గ్రామంలోని ప్రజలు పాల్గొన్నారు.