ప్రజాస్వామ్యంలో పత్రిక పాత్ర చాలా గొప్పది

ప్రజాస్వామ్యంలో పత్రిక పాత్ర చాలా గొప్పది

-తెలంగాణ కెరటం క్యాలెండర్ ఆవిష్కరించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు 

 

తెలంగాణ కెరటం ధర్మపురి నియోజకవర్గ ప్రతినిధి జనవరి 11

ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర చాలా గొప్పదని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ధర్మపురి ఆలయం మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణారావు అన్నారు శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ను సతి సమేతగా ఉత్తర ద్వార దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు గావించారు అనంతరం ఆలయ అర్చకులు జువ్వాడి కృష్ణారావు దంపతులకు స్వామి వారి శేష వస్త్రంతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు ఆశీర్వదించారు అనంతరం ఆలయ ఆవరణలో తెలంగాణ కెరటం క్యాలెండర్ 2025 ఆవిష్కరించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ధర్మపురి ఆలయ మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణారావుదంపతులు ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర చాలా గొప్పదని ప్రజలకు ప్రభుత్వానికి రథసారథిగా పత్రికలు పనిచేస్తున్నాయని ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కార దిశగా పనిచేస్తున్నాయని కొనియాడారు ఆనతి కాలంలోనే ప్రజల మన్ననలు పొందిన తెలంగాణ కెరటం పత్రిక మరింత ముందుకు వెళ్లాలని ఆశిస్తూ కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బుగ్గారం మాజీ జడ్పిటిసి బాధనేని రాజేందర్ ఎంపీపీ రాజమణి తిమ్మాపురం మాజీ ఉప సర్పంచ్ బొడ్ల శ్రీనివాస్ పిఎసిసిఎస్ చైర్మన్ (తిమ్మాపూర్) సాయిని సత్తయ్య శ్రీనివాస్ స్తంభంపల్లి మాజీవార్డు సభ్యులు మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పాదం దుబ్బ స్వామి యాదవ సంఘం నాయకులు చింతల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment