*పాఠశాల విద్యా శాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి*
తెలంగాణకు కెరటం లింగంపేట మండల ప్రతినిధి నవంబర్ 30:
-సమగ్ర శిక్ష సమగ్ర శిక్ష ఉద్యోగాలసంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ
ఈ రోజున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట వ్యాప్తంగా నిర్వస్తున్న మండల వనరుల కేంద్రంలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసినటువంటి మండల స్థాయి నిరసన దీక్షలో భాగంగా తపస్ ఉపాధ్యాయల సంఘం సంతోష్ మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పని చేస్తున్నా ఉద్యోగాలు మెరిట్ కం రోస్టర్ ఇంటర్వ్యూ, పరీక్షల ద్వారా నియామకం కాబడి విద్యా వ్యవస్థలో కీలకంగా పని చేస్తున్న వీరికి ముఖ్యమంత్రివర్యులు ఇచ్చిన హామీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరినారు తమ వారి యొక్క న్యాయమైన డిమాండ్ అయినా సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యా శాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని మరియు తక్షణమే పేస్కేల్ అమలు సాధనకై ఈ రోజున మండల స్థాయిలో నిరసన దీక్ష కార్యక్రమలో వీరికి న్యాయం జరిగేంత వరకు తమ సంఘం మద్దతు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉంటుందని తెలిపినారు సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వేరే రాష్ట్రాల్లో హర్యానా హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ ఉద్యోగులకు రెగ్యులర్ చేసి మినిమం టైం స్కేల్ ఇస్తున్నారని సమగ్ర శిక్ష ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పద్ధతిని అమలు చేయాలని ప్రభుత్వం స్పందించాలని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్దీవుల సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, మండలాధ్యక్షులు రాజు పి ఆర్ టి యు టీఎస్ లింగంపేట్ శాఖ అధ్యక్షులు రవీంద్ర శర్మ, ప్రధాన కార్యదర్శి రాజి రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రజినీకాంత్ గౌడ్, అసోసియేట్ సభ్యులు సుధాకర్ రావు, పాణి కుమార్ రాజ్ టి పి యు ఎస్ లింగంపేట్ మండల శాఖ అధ్యక్షులు సంతోష్, ప్రధాన కార్యదర్శి సంగమేశ్వర్ ఎస్సీ ఎస్టీ , లింగంపేట్ మండల శాఖ అధ్యక్షులు మురళి కృష్ణ , ప్రధాన కార్యదర్శి సూర్య మండల సభ్యులు సంతోష్ రెడ్డి, హేమలత,రాజు సంఘ గౌడ్,రాజు,విజయ్,స్వప్న,అశ్విని, మీనా,సంతోష్,బన్సిలాల్, రాజేష్, ఆంజనేయులు ఇతర ఉద్యోగాలు పాల్గొన్నారు