ధర్మశాస్త్ర అన్న దానసేవా సమితి సేవలు అభినందనీయం

శ్రీ ధర్మశాస్త్ర అన్న దానసేవా సమితి సేవలు అభినందనీయం

 

తెలంగాణ కెరటం ; సూర్యాపేట జిల్లా ప్రతినిధి డిసెంబర్ 17 ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాముల తో పాటు ఇతర స్వాములకు శ్రీధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు, కుడ కుడ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షులు మహంకాళి ప్రణీత్ తెలిపారు. మంగళవారం శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి ఆధ్వర్యలో లో జరుగుతున్న అన్నప్రసాద కార్యక్రమమునకు తన సొంత ఖర్చులతో అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40 రోజులపాటు కఠోర దీక్ష చేసిన స్వాములకు అన్న ప్రసాదం నిర్వహించే భాగ్యం కలగడం పూర్వజన్మ సుకృతం అన్నారు. అయ్యప్ప స్వామి దీవెనలతో ప్రజలతా సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరు మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలన్నారు. ప్రతిరోజు సుమారు 500 మంది అయ్యప్ప భక్తులకు శ్రీధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించటం ఎంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మహంకాళి సోమయ్య నాగమ్మ రమ్య, అద్విత,ఆశ్రిత, అభయ్ రామ్, శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన సేవా సమితి నిర్వాహకులు ఎర్రంశెట్టి ఉపేందర్, వెంపటి పురుషోత్తం, రాచకొండ శ్రీను, గొట్టిపర్తి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment