సంవత్సరం గడవకముందే 51 మంది విద్యార్థుల ప్రాణాలు తీసుకున్న ప్రభుత్వం
ఏబీవీపీ జిల్లా కన్వీనర్ హరీష్ రావు
ఈరోజు ఏబీవీపీ వికారాబాద్ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ హరీష్ రావు మహేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఏ విధంగా ఆడుతుందో ఈ ప్రభుత్వం కూడా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుంది కనీస వసతులు లేక విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్నారు మధ్యాహ్న భోజనం వల్ల ఫుడ్ పాయిజన్ ఐ ఎంతోమంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు ఒకే సంవత్సరంలో 886 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురయ్యారు వారు మృత్యుని జయించి బతికారు ఒక సంఘటన జరిగి మరవకముందే ఇంకో సంఘటన జరుగుతుంది మద్యానికి మంత్రి ఉండగానే విద్యకు మంత్రి లేడు ఈ ప్రభుత్వం విద్యార్థుల కోసం అసలు పట్టించుకోవడం లేదు మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేని భోజనం వడ్డిస్తున్నారు ఎక్కడైనా ఏమైనా సంఘటన అధికారులు అస్సలు స్పందించడం లేదు అంటే ప్రాణాలు కోల్పోతేనే వీరు స్పందిస్తారా ఇప్పటికే 51 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అసలు కనీస సోయ లేకుండా ఎక్కడ పడ్డా గొంగడి అక్కడే ఉన్నట్లు వారి వ్యవహార శైలి కనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా స్పందించి హాస్టల్ విద్యార్థుల జీవితాలను బాగు చేయాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో టౌన్ సెక్రెటరీ మహేష్ శివ ప్రసాద్ తేజ రామకృష్ణ ప్రవీణ్ బాలకృష్ణ సాయి తదితరులు పాల్గొన్నారు