పారదర్శకంగా సర్వే జరగాలి.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 17:
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.మెదక్ మున్సిపాలిటీ లోని దాయర వీధిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు.మంగళవారం ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల క్షేత్రస్థాయి స్థితిగతులపై ఇందిరమ్మ ఇళ్ల యాప్ వినియోగిస్తూ చేస్తున్న సర్వే ప్రక్రియ ను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించిమాట్లాడుతూ..ఇండ్లులేని నిరుపేదలకు నివాసం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తోందని దరఖాస్తుదారులు..సంబంధిత పత్రాలను ముందస్తుగా అందుబాటులో పెట్టుకొని సర్వే వేగవంతం అయ్యేందుకు సహకరించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి, తప్పిదాలకు తావులేకుండా వివరాలను సేకరించి ఇందిరమ్మ యాప్‌లో లాగిన్ అయ్యి వివరాలను పక్కగా నమోదు చేయాలన్నారు.సర్వే కోసం భూమి యాజమాన్య పత్రం అత్యంత ముఖ్యమైనదని, సొంత ఇంటికి స్థలం ఉందా, ఉంటే దానికి సంబంధించిన దృవపత్రాలు, అవి లేని పక్షంలో ఇంటి పన్ను రసీదులు, తెల్ల రేషన్ కార్డ్ తదితర పత్రాలను పరిశీలించాలన్నారు.లబ్దిదారుడితో పాటు ఇంటి పైకప్పు, స్థలానికి సంబందించిన చిత్రాలను యాప్ లో సక్రమంగా అప్లోడ్ చేయాలన్నారు.ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలని, సర్వే జరిగే సమయంలో ప్రజలు అందు బాటులో ఉండే విధంగా షెడ్యూల్ గురించి ముందుగానే సమాచారం అందించాలని అన్నారు.ఈ కార్యక్రమం లో కలెక్టర్ వెంట తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.