*ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే తెలంగాణ తల్లి విగ్రహం మార్పు*
–బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి
తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి డిసెంబర్ 10 :
తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం రేవంత్ రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి అన్నారు. బెజ్జంకి మండలంలోని గుండారం గ్రామంలో మంగళవారం రోజున తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు పేరుతో, తెలంగాణ చరిత్ర పై, అస్థిత్వం పై దాడి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డితెలంగాణ తల్లి అంటే ఒక దేవతా మూర్తి అని, కిరీటం లేకుండా దేవత ఉంటుందా అని ప్రశ్నించారు. బతుకమ్మ లేదు, తెలంగాణ అస్తిత్వం లేదు, అసలు తెలంగాణ ఆత్మనే లేదు, పిచ్చోడి చేతిలో రాయిలా విలవిలాడుతోంది తెలంగాణ తల్లి అని అన్నారు. చెయ్యి గుర్తుతో ఉన్న కొత్త విగ్రహం, కాంగ్రెస్ తల్లి అవుతుంది, కానీ తెలంగాణ తల్లి ఎప్పటికీ కాదు, కాలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్ మీద ద్వేషంతో, అసూయతో తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే, చరిత్ర నిన్ను క్షమించదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కనగండ్ల తిరుపతి, కచ్చు రాజయ్య, దుంబాల రాజమహేందర్ రెడ్డి, ముక్కిస తిరుపతిరెడ్డి, దీటి రాజు, ముక్కిస రాజిరెడ్డి, కర్రావుల మల్లేశం, బిగుల్ల మోహన్, ఏల శేఖర్ బాబు, బుర్ర ప్రభాకర్, మామిండ్ల తిరుపతి, బామండ్ల లక్ష్మణ్, తాళ్లపల్లి భీమయ్య, ఎలుక దేవయ్య, ఎలుకంటి గురువారెడ్డి, బొమ్మకంటి రామలింగారెడ్డి, బండ బాబు, తాళ్లపల్లి రాము, కత్తి రాములు గౌడ్, పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్, బోడబట్ల తిరుపతి, తాళ్లపల్లి నరేష్, మొగిలి తిరుపతి, సూరం శ్రీకాంత్, తాళ్లపల్లి శ్రీను, లక్క లక్ష్మణ్, బొప్పెన కుంటయ్య, పెద్ది మల్లేశం తదితరులు పాల్గొన్నారు.