ఉన్నత విద్యారంగానికి నష్టం కలిగించే యూజీసీ ముసాయిదా వెనక్కి తీసుకోవాలి
వేల్పూర్ అంబేద్కర్ యువజన సంఘాల డిమాండ్
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి ఫిబ్రవరి 10 :
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో విశ్వ రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద యుజిసి ముసాయిదా వెనుకకు తీసుకోవాలనీ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు జె.ప్రభాకర్ మాట్లాడుతూ ఉన్నత విద్య రంగానికి నష్టం కలిగించేల యుజిసి రూపొందించిన ముసాయిదాను తక్షణమె వెనుకకు తీసుకోవాలనీ అన్నారు విశ్వవిద్యాలయాల్లోని కార్యకలాపాల్లో గవర్నర్ కు ప్రాధాన్యం కల్పించడం భారత రాజ్యాంగం సృష్టికి విరుద్ధమన్నారు ప్రపంచాన్ని నడిపించేది విద్య ఒక్కటే అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి అలాంటి విద్య వ్యవస్థను విధ్వంసం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరిపడే నిధులు కేటాయించలేదనీ మేము వ్యతిరేకిస్తున్నామనీ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి జాంబవ చమార్ ఉపాధ్యక్షులు శివకృష్ణ పాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.