అధికారుల సమన్వయంతో ఉపరాష్ట్రపతి పర్యటన విజయవంతం చేయాలి.
సి ఎస్.శాంతి కుమారి.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 21:
ఈనెల 25వ తేదీన కౌడిపల్లి మండలం తునికి లో గల కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగే కార్యక్రమానికి గౌరవ ఉపరాష్ట్రపతి హాజరుకానున్నారని పర్యటన కోసం అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతo చేయాలని సిఎస్ శాంతి కుమారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి,వివిధ శాఖల అధికారులకు తెలిపారు.శనివారం హైదరాబాద్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తో మాట్లాడారు.ఈ సందర్భంగా సిఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పర్యటన లో ఏలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పర్యటన మధ్యాహ్నం 2:15 నుంచి 4:15 వరకు రెండు గంటల పాటు మెదక్ జిల్లాలో ఉంటుందని,ఈ కార్యక్రమానికి పోలీసు,వైద్య ,ఆర్ అండ్ బి, ఇతర శాఖ ల సమన్వయంతో పని పనిచేస్తామన్నారు.ట్రాఫిక్ నియంత్రణ చేసి, పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని,డయాస్ ను అలంకరిస్తామన్నమని,కృషి విజ్ఞాన కేంద్రంలో ఉపరాష్ట్రపతి ఆర్గానిక్ వ్యవసాయంపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారని, ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న రైతులతో నేరుగా మాట్లాడతారని, అత్యవసర వైద్య సిబ్బందిని అందుబాటులోఉంచుతున్నామని కలెక్టర్ సి స్ శాంతి కుమారి కి వివరించారు.జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పర్యటనకు పటిష్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీ స్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.