క్రికెట్ లీగ్ విజేత సజ్జు టీమ్ 

క్రికెట్ లీగ్ విజేత సజ్జు టీమ్ 

 

తెలంగాణ కెరటం, డిసెంబర్ 29, మందమర్రి

 

మందమరి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ వేదికగా నిర్వహించిన మందమరి ప్రీమియర్ లీగ్ శనివారం రోజున ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఫైనల్లో సజ్జు లెవెన్ వర్సెస్ తేజ 11 జట్లు తలపడగా 14 ఓవర్ల మ్యాచ్లో తేజా టీం మొదటగా బ్యాటింగ్ చేసి 99 పరుగులు చేయగా , 100 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సబ్జు టీం 13.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. ఈ మ్యాచ్ లొ సుజు టీం క్రీడాకారుడు పచ్చమట్ల శ్రీకాంత్ 50 పరుగులు సాధించి జట్టును విజేతగా నిలిపాడు. ఈ యొక్క టోర్నీకి పిండి సాగర్ ఉత్తమ క్రీడాకారుడిగా నిలిచాడు. సింగరేణి మైదానంలో నిర్వహించిన ఈ యొక్క క్రికెట్ టోర్నీకి మందమరి సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యి ప్రథమ , ద్వితీయ స్థానంలో నిలిచిన జట్లకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ యువత చెడు మార్గంలో ప్రయాణించకుండా చెడు అలవాట్లకు , మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడల పట్ల ఆసక్తి చూపాలని అన్నారు. అంతేకాకుండా క్రీడలు దేహ దారుఢ్యానికి ఎంతో కృషి చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఇరుజట్లకు అభినందనలు తెలిపారు. ఈ విజేత కార్యక్రమంలో ఇరుజట్ల క్రీడాకారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment