---Advertisement---

సాయినాథుని దర్శించుకున్న జువ్వాడి కృష్ణారావు 

---Advertisement---

సాయినాథుని దర్శించుకున్న జువ్వాడి కృష్ణారావు

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 13 : కోరుట్ల పట్టణంలోని సాయిరామ నది తీరంలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు శుక్రవారం దర్శించుకున్నారు. దత్త జయంతి సందర్భంగా ఆలయంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కృష్ణారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు జువ్వాడి కృష్ణారావుకు మంగళ శాసనములు అందజేసి తీర్థ ప్రసాద వితరణ చేశారు. అనంతరం జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని సాయిబాబాను వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి, కౌన్సిలర్లు ఎంబెరి నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పుప్పాల ప్రభాకర్, నేమూరి భూమయ్య, సతీష్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment