---Advertisement---

వైభవంగా గుంటి పెరుమాండ్ల (కట్ట కింద తీర్థం) జాతర 

---Advertisement---

వైభవంగా గుంటి పెరుమాండ్ల (కట్ట కింద తీర్థం) జాతర

 

 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 16 : కోరుట్ల పట్టణంలోని చెరువు కట్ట క్రింద గల అతి పురాతన ఆలయం గుంటి పెరుమాండ్ల జాతర మహోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. జాతర మహోత్సవానికి పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆలయ అర్చకులు చింత సునీల్ స్వామి వైదిక నిర్వహణలో ఉదయం విశ్వక్సెన ఆరాధన, పుణ్యాహవాచనం స్వామి మూల విరాట్టుకు ఫల పంచామృత అభిషేకాదులు జరిపారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను రథంపై ఊరేగించారు. జాతర మహోత్సవంలో కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, బీజేపీ నాయకులు సురభి నవీన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు ఆదిశేషువర్ధన్ స్వామి, శ్రీ చరణ్, చింత సురేష్, పీతాంబర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment